భూపాలపల్లి (Bhupalpally జిల్లా పరిధిలోని కాళేశ్వరం – భూపాలపల్లి (Kaleshwaram-Bhupalpally) 353 నేషనల్ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం (Major Road Accident) చోటుచేసుకుంది. సరస్వతి పుష్కరాలకు (Saraswati Pushkaralu) వెళ్తున్న భక్తులతో నిండిన జైలో మహీంద్రా కారు, ఓ ఆటోను ఢీకొనడంతో ఈ దుర్ఘటన జరిగింది.
ప్రమాదం వివరాలు
ఈ ఘటనలో చిట్యాల మండలం నైన్‌పాక (Nainpaka) గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. అలాగే, ప్రమాదంలో 15 మందికి తీవ్రగాయాలు అయ్యాయి. తీవ్రంగా గాయపడినవారిని 108 అంబులెన్స్ ద్వారా భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పుష్కర స్నానాల కోసం భక్తులు ప్రయాణిస్తున్న సమయంలో వేగంగా వస్తున్న జైలో కారు, ఎదురుగా వస్తున్న ఆటోను ఢీకొట్టినట్టు స్థానికులు వెల్లడిస్తున్నారు. గాయపడినవారిలో కొంతమందికి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాద ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.








