అవును.. పాక్‌ ఇంటెలిజెన్స్‌ను కలిశా – జ్యోతి మల్హోత్రా

అవును.. పాక్‌ ఇంటెలిజెన్స్‌ను కలిశా - జ్యోతి మల్హోత్రా

ఎన్ఐఏ (NIA) ద‌ర్యాప్తులో యూట్యూబర్ (YouTuber) జ్యోతి మల్హోత్రాకు (Jyoti Malhotra) సంబంధించిన సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట‌ప‌డ్డాయి. పాకిస్తాన్‌ (Pakistan) తో త‌న‌కు సంబంధాలు ఉన్న‌ట్లుగా యూట్యూబ‌ర్ అంగీక‌రించింది. ఎన్ఐఏ విచార‌ణ‌లో పాక్‌ ఇంటెలిజెన్స్‌ (Pakistan Intelligence) అధికారులతో తనకు సంబంధాలు ఉన్నట్లు జ్యోతి మ‌ల్హోత్రా అంగీకరించింది (Admitted). 2023లో వీసా (Visa) కోసం పాక్‌ హైకమిషన్‌కు వెళ్లినప్పుడు, అక్కడ పని చేసే డానిష్‌ (Danish) అనే అధికారితో పరిచయం ఏర్ప‌డింద‌ని, డానిష్‌తో ఆమె నిత్యం టచ్‌లో ఉంటుందని వెల్లడించింది.

ఆపరేషన్‌ సిందూర్‌ (Operation Sindoor) సమయంలో పాక్‌ సరిహద్దు ప్రాంతాలకు సంబంధించిన బ్లాకౌట్‌ (Blackout) సమాచారాన్ని జ్యోతి పాక్‌కు అందజేసినట్లు అనుమానాలు వ్యక్తమయ్యాయి. దర్యాప్తు బృందం ఆమె నుంచి మూడు సెల్‌ఫోన్లు, ఒక ల్యాప్‌టాప్ స్వాధీనం చేసుకొని, ఆమె రెండు బ్యాంకు ఖాతాలను పరిశీలిస్తోంది. నేటితో ఆమె పోలీస్‌ కస్టడీ ముగుస్తుంది. హిస్సార్‌ కోర్టులో ఆమెను హాజరుప‌ర్చ‌నున్నారు.

తాజాగా జ్యోతి డైరీ, ఫొటోలు వైరల్‌ అయ్యాయి. అందులో పాక్‌ దేశంపై ఆమె అభిమానాన్ని వ్యక్తం చేసింది. అక్కడి ప్రజల ప్రేమ, ఆ దేశం క్రేజీ, రంగురంగులదిగా ఉన్నట్లు తెలిపింది.

పాక్‌ హైకమిషన్‌లో వీసా విభాగం ఉద్యోగి డానిష్‌, పంజాబ్‌ మలేర్‌కోట్లా ప్రాంతానికి చెందిన గజాల అనే యువతిని హనీట్రాప్‌లోకి లాగి గూఢచర్యానికి వాడినట్లు దర్యాప్తులో బయటపడ్డది. డానిష్ గజాలకు వీసా పొందడంలో సహాయం చేసిన తర్వాత ఆమెను గూఢచర్యానికి వాడటం ప్రారంభించాడు. సైనిక స్థావరాల సమాచారాలు అడిగి, నగదు లావాదేవీలలో పాల్గొన్నాడు. డానిష్ నంబర్‌ను గజాల ఫోన్‌లో ‘హ్యాపీనెస్‌’గా సేవ్‌ చేశాడని కూడా గుర్తించారు. వీసా కోసం పాక్‌ హైకమిషన్‌కు వచ్చే వారిని డానిష్ ట్రాక్ చేసి, గూఢచర్యలో వాడుకున్నాడని వివరించారు. జ్యోతి కూడా వీసా కోసం వెళ్లినప్పుడు అతడు ట్రాప్ చేసిన‌ట్లుగా ఆరోప‌ణ‌లు వస్తున్నాయి.

Join WhatsApp

Join Now

Leave a Comment