చంద్రగిరిలో ఘోర రోడ్డు ప్రమాదం.. డివైడర్‌ను ఢీకొట్టిన ఆర్టీసీ బ‌స్సు

చంద్రగిరిలో ఘోర రోడ్డు ప్రమాదం.. డివైడర్‌ను ఢీకొట్టిన ఆర్టీసీ బ‌స్సు

తిరుపతి జిల్లా చంద్రగిరి (Chandragiri) మండలంలోని ఐతేపల్లె (Ithaepalle) వద్ద ఆదివారం అర్ధ‌రాత్రి ఘోర‌ రోడ్డు ప్రమాదం జరిగింది. తిరువన్నామలై (Tiruvannamalai) నుంచి తిరుపతి (Tirupati) వస్తున్న ఆర్టీసీ బస్సు (RTC Bus) అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టి, కొంత దూరం వాహనం దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో మొత్తం 35 మంది ప్రయాణికులు గాయపడగా, వారిలో కనీసం 10 మందికి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం.

బస్సు డివైడర్‌ను ఢీకొట్టిన వెంటనే పెద్ద శ‌బ్దం వినిపించగా, స్థానికులు, పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. బస్సులో ఇరుక్కుపోయిన ప్రయాణికులను బయటకు తీసి, వెంటనే తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. బాధితులకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు.

ఈ ప్రమాదానికి ప్రధాన కారణం డ్రైవర్ నిద్ర మత్తు అని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఘటనాస్థలంలో ట్రాఫిక్ కొంతసేపు నిలిచిపోయింది. పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ప్ర‌యాణికుల బంధువులు, కుటుంబ స‌భ్యులు తిరుప‌తి రుయా ఆస్ప‌త్రికి చేరుకుంటున్నారు. ప‌రిస్థితి విష‌మంగా ఉన్న 10 మంది క్ష‌త‌గాత్రుల‌ను వైద్య బృందాల ప‌ర్య‌వేక్ష‌ణ‌లో మెరుగైన చికిత్స పొందుతున్న‌ట్లుగా స‌మాచారం.

Join WhatsApp

Join Now

Leave a Comment