జమ్మూ కాశ్మీర్ (Jammu Kashmir) లోని అంతర్జాతీయ సరిహద్దు సమీపంలో భద్రతా బలగాలు (BSF) చేపట్టిన కీలక ‘కౌంటర్-ఇన్ఫిల్ట్రేషన్ ఆపరేషన్’ (Counter-Infiltration Operation)లో ఏడుగురు ఉగ్రవాదులు (Terrorists) హతమయ్యారు. వీరంతా పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థ జైష్-ఎ-మహ్మద్ (Jaish-e-Mohammed)కు చెందినవారుగా గుర్తించారు. శత్రు దేశం పాకిస్తాన్ నుంచి దేశ సరిహద్దుల్లోకి చొరబడేందుకు ఈ ముఠా ప్రయత్నించగా, BSF బలగాలు అప్రమత్తమయ్యాయి. కాల్పులు జరిపి ఉగ్రవాదాలను ఖతం చేశాయి.
గురువారం రాత్రి 11 గంటల సమయంలో సమ్బా జిల్లాలోని సరిహద్దు ప్రాంతాల్లో అనుమానాస్పదంగా కదులుతున్న వారిని BSF బలగాలు గుర్తించాయి. వెంటనే అప్రమత్తమైన బలగాలు దేశంలోకి చొరబడుతున్న ఉగ్రవాదాలను యత్నాన్ని భగ్నం చేసింది. జైష్-ఎ-మహ్మద్ ఉగ్రవాదాల చొరబాటును అడ్డుకొని, వారిని హతమార్చినట్లుగా BSF అధికారికంగా ట్విట్టర్ వేదికగా ప్రకటించింది.