అనకాపల్లి (Anakapalli) జిల్లా పరవాడ (Paravada) ప్రాంతంలో మంగళవారం మధ్యాహ్నం ఘోర అగ్నిప్రమాదం (Fire accident) సంభవించింది. విద్యుత్ (Electric) హైటెన్షన్ (High-Tension) లైన్ తీగ (Wire) విరిగిపడటంతో ఈ ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది. విద్యుత్ తీగ కింద ఒక స్క్రాప్ షాప్ స్టాక్ ఉండటంతో మంటలు వేగంగా వ్యాపించాయి. ఫార్మా కంపెనీలకు (Pharma Companies) ఆనుకొని ఉన్న ఈ షాప్లో భారీగా మంటలు ఎగసిపడుతున్నాయి. మంటల తీవ్రతతో దట్టమైన పొగలు అలుముకున్నాయి.
అగ్నిమాపక దళం రంగంలోకి..
అనకాపల్లి పరవాడ నుంచి అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటల అదుపుపై ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే పూర్తిగా మంటలు అదుపులోకి వచ్చాయా లేదా అన్నది ఇంకా స్పష్టత లేదు. ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ప్రస్తుతానికి ప్రాణ నష్టం గానీ, ఆస్తి నష్టం గానీ అధికారికంగా ప్రకటించలేదు. అధికారుల విచారణ అనంతరం మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.