పశ్చిమ బెంగాల్ (West Bengal) లోని నదియా జిల్లా శాంతీపుర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వింత ఘటన చోటుచేసుకుంది. మధు ఖాతూన్ (Madhu Khatun). బాపన్ షేక్ (Bapan Sheikh) దంపతులు బేర్పారా ప్రాంతంలో నివసిస్తున్నారు. అయితే ఇటీవల వీరి ఇంట్లో షాకింగ్ సంఘటన ఒకటి జరిగింది.
“నీ ముక్కు (Nose) చాలా అందంగా ఉంది. ఓ అవకాశం దొరికితే దాన్ని కొరికి తినేస్తాను” అంటూ భర్త బాపన్ షేక్ తరచూ అనేవాడట. అయితే ఊహించని విధంగా ఒకరోజు ఆ మాట నిజంగా చేసేశాడు. ఆమె ముక్కును బాపన్ షేక్ నిజంగానే కొరికి తిన్నాడు. ఈ దాడితో బెంబేలెత్తిపోయిన మధు ఖాతూన్, అరుస్తూ కేకలతో ఇంటి బయటకు పరుగులు తీసింది. వెంటనే శాంతీపుర్ (Shantipur) పోలీస్ స్టేషన్‌కు వెళ్లి భర్తపై ఫిర్యాదు చేసింది. “అతను అన్న మాటను నిజంగా చేశాడు. నా ముక్కును కొరికేశాడు” అంటూ ఆమె పోలీసులకు తెలిపింది. ప్రస్తుతం ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కాగా, ఈ సంఘటన స్థానికంగా సంచలనంగా మారింది.









పిఠాపురంలో నాగబాబు.. వర్మ ఎపిసోడ్‌పై సైలెన్స్