ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ (Indian National Congress) చేసిన ఓ పోస్టు (Post) రాజకీయంగా పెద్ద దుమారాన్ని రేపింది. ప్రధాని నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi) తల, చేతులు, కాళ్లు లేని ఫోటోను “బాధ్యత గల సమయంలో గయబ్” అనే హెడ్‌లైన్‌తో ఎక్స్ (ట్విట్టర్)లో పోస్టు చేయడం బీజేపీ (BJP) నేతల ఆగ్రహం తెప్పించింది. బీజేపీ నేతలు ఈ చర్యను తీవ్రంగా ఖండించారు. ఇది కేవలం ప్రధానిని అవమానించడమే కాదని, ఉగ్రవాదులను అనుసరించే విధానమని ఆరోపించారు. “తల తీసే పద్ధతి లష్కరే తోయిబా, పాకిస్తాన్ ఉగ్రవాదుల శైలి” అంటూ కాంగ్రెస్‌పై బీజేపీ నేతలు మండిపడ్డారు.
ఢిల్లీ పోలీసు కమిషనర్ (Delhi Police Commissioner) కు బీజేపీ నాయకులు ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్ పార్టీపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అంతేగాక, “ఇది ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కాదు, లష్కరే పాకిస్తాన్ కాంగ్రెస్ (Lashkar-e-Pakistan Congress)” అంటూ బీజేపీ నేతలు విమర్శలు గుప్పించారు. ప్రజాస్వామ్యంలో వ్యంగ్యానికి స్థానం ఉందని అంగీకరిస్తున్నప్పటికీ, ఈ స్థాయి కించపరిచే పోస్టులు తగవని మండిపడ్డారు.
'जिम्मेदारी' के समय – Gayab pic.twitter.com/gXFublGkGn
— Congress (@INCIndia) April 28, 2025
‘ఇది సినిమా కాదు బ్రదర్’.. – పవన్‌కు కాంగ్రెస్ ఎంపీ కౌంటర్