ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో పదో తరగతి (10th Class) వార్షిక పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. పది ఫలితాల్లో (Results) ఓ విద్యార్థిని రికార్డ్ సృష్టించింది. టెన్త్ పబ్లిక్ పరీక్షల చరిత్రలో సంచలన ఘట్టం నమోదు చేసింది. కాకినాడ (Kakinada) లోని ఓ ప్రైవేట్ స్కూల్‌కి చెందిన విద్యార్థిని యల్ల నేహాంజని (Yalla Nehanjani) తన ప్రతిభను చాటుతూ 600కు 600 మార్కులు (600 out of 600 Marks) సాధించింది. ఇది పదో తరగతిలో ఇప్పటివరకు ఎవరూ సాధించని అరుదైన ఘనతగా అధికారులు పేర్కొన్నారు.
నేహాంజని ప్రతి సబ్జెక్ట్‌లోని వందకు వంద మార్కులు సాధించి పూర్తి స్కోర్‌ను నమోదు చేసింది. విద్యార్థిని సాధించిన అద్భుత విజయంపై విద్యా రంగం, సామాజిక మాధ్యమాల్లో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. విద్యార్థులు, తల్లిదండ్రులకు స్ఫూర్తిగా నిలిచే ఈ విజయం నేహాంజనికి పెద్ద ఆస్తిగా మారనుంది.








