తెలంగాణ హైకోర్టు నుండి బీఆర్ఎస్ (BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్‌కు ఒక గొప్ప ఊరట లభించింది. గతేడాది (2024) సెప్టెంబర్ 30న ఆదిలాబాద్ (Adilabad) జిల్లా ఉట్నూరు (Utnoor) పోలీస్ స్టేషన్‌లో ఆయనపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌ను హైకోర్టు కొట్టివేసింది. కాంగ్రెస్ (Congress) నాయకురాలు ఆత్రం సుగుణ (Athram Suguna) ఇచ్చిన ఫిర్యాదు మేరకు, మూసీ నదీ శుద్ధి (Musi River Rejuvenation) పనుల పేరిట ప్రభుత్వం రూ.25,000 కోట్ల కుంభకోణానికి పాల్పడిందని కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు తమ పార్టీ ప్రతిష్ఠను దెబ్బతీశాయని ఆమె ఆరోపించారు. దీంతో ఆమె ఫిర్యాదును ఆధారంగా చేసుకొని పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.
ఈ ఎఫ్‌ఐఆర్‌ను కొట్టివేయాలని కోరుతూ కేటీఆర్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు, కేటీఆర్‌పై నమోదైన ఎఫ్‌ఐఆర్‌ను కొట్టివేస్తూ తీర్పు ఇచ్చింది. దీంతో ఆయనకు ఈ కేసులో భారీ ఊరట లభించినట్లయింది.








సీటు త్యాగం చేసిన వర్మకు సొంత పార్టీలోనే ‘షాక్’