వైసీపీ (YSRCP) మాజీ నేత విజయసాయిరెడ్డి (Vijayasai Reddy) సిట్ విచారణ అనంతరం చేసిన కామెంట్స్‌కు (Comments) వైసీపీ నుంచి స్ట్రాంగ్ కౌంటర్ పడింది. వైఎస్ జగన్‌పై వద్ద కోటరీ వల్లే తాను పార్టీకి దూరమయ్యానని విజయసాయి సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. అయితే, ఈ వ్యాఖ్యలపై వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి (YV Subba Reddy) కౌంటర్ (Counter) ఇచ్చారు. పార్టీ నుంచి వెళ్లిపోయాక అభాండాలు వేస్తున్నారని, కోటరీ ఉందా లేదా అనేది అధికారంలో ఉన్నప్పుడు తెలియదా? అని విజయసాయిరెడ్డిని ప్రశ్నించారు.
వైసీపీలో 2వ స్థానంలో ఉన్నానని చెప్పుకున్న వ్యక్తి, కోటరీ (Coterie)) ఎవరు నడిపారో కూడా చెబితే బాగుండేదని చురకలు సెటైర్లు వేశారు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి. వైసీపీలో ఒకటి నుంచి వంద వరకు వైఎస్ జగనే.. కోటరీ అనే పదం వైసీపీలో అస్సలు ఉండదన్నారు. వైసీపీలో నంబర్ 2 అనే పదం ఎప్పుడూ లేదు, రాబోయే రోజుల్లో కూడా ఉండదు. పార్టీ నుంచి నాయకుల వరకు, అన్నీ జగన్ ఒక్కరే అని స్పష్టం చేశారు. జగన్ (YS Jagan) ఎప్పుడూ నాయకులతో, అధికారులతో చర్చించి నిర్ణయాలు తీసుకుంటారని, కోటరీ అనే పదానికి వైసీపీలో చోటేలేదన్నారు. పార్టీని వదిలి వెళ్లినవాళ్లు పార్టీపై తప్పుడు ఆరోపణలు (False Allegations) చేయడం తగదన్నారు.
ప్రస్తుత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ నాయకులపై తప్పుడు కేసులు పెడుతోందని విమర్శించిన సుబ్బారెడ్డి, లిక్కర్ స్కామ్ అని కొందరిని భయపెట్టి లొంగదీసుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. కానీ వైసీపీ హయాంలో ఎలాంటి స్కామ్‌లు (Scams) జరగలేదన్నారు. కూటమి పెడుతున్న తప్పుడు కేసులపై న్యాయపోరాటానికి సిద్ధంగా ఉన్నామన్నారు.