ఢిల్లీలో కుప్పకూలిన భవనం.. నలుగురు మృతి

ఢిల్లీలో కుప్పకూలిన భవనం.. నలుగురు మృతి

దేశ రాజధాని ఢిల్లీ (Delhi) లో శుక్ర‌వారం అర్ధరాత్రి విషాదకర ఘటన చోటుచేసుకుంది. ముస్తఫాబాద్ (Mustafabad) ప్రాంతంలోని ఓ ఆరు అంతస్తుల భవనం (Six-Storey Building) అకస్మాత్తుగా కుప్పకూలిపోయింది (Collapsed). ఈ ప్రమాదంలో ఇప్పటివరకు నలుగురు (Four People) మరణించగా (Died), మరో ఇద్దరు గాయపడ్డారు. శిథిలాల కింద ఇంకా కొంతమంది చిక్కుకుపోయి ఉండే అవకాశం ఉన్నట్టు అధికార వర్గాలు భావిస్తున్నాయి.

ఈ ఘటనపై స్పందించిన అదనపు పోలీస్ కమిషనర్ వినీత్ కుమార్ (Vineet Kumar).. భవనం నిర్మాణ పనులు కొనసాగుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుందని తెలిపారు. తెల్లవారుజామున 2:50 గంటల సమయంలో భవనం కూలిపోయినట్లు సమాచారం అందిన వెంటనే, ఎన్‌డీఆర్‌ఎఫ్‌ (NDRF) బృందాలు, ఢిల్లీ ఫైర్ సర్వీసెస్ (Delhi Fire Services) జట్లు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి.

శిథిలాల్లో కనిపించని మహిళలు, పిల్లలు
డివిజనల్ ఫైర్ ఆఫీసర్ రాజేంద్ర అత్వాల్ (Rajendra Atwal) వెల్లడించిన వివరాల ప్రకారం.. కూలిపోయిన భవనంలో ఇద్దరు మహిళలు, వారి చిన్నారులతో కలిసి నివాసముండగా.. వారు ప్రస్తుతం ఎక్కడ ఉన్నారన్నది తెలియకపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఓ మహిళకు ముగ్గురు పిల్లలు ఉండగా, మరొకరికి ఇద్దరు లేదా ముగ్గురు పిల్లలు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. వారిని రక్షించే ప్రయత్నాలు తీవ్రంగా సాగుతున్నాయి. ప్రస్తుతం ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నిర్మాణ నిబంధనలు పాటించకుండా భవన నిర్మాణం జరిగిందా? అనేదానిపై విచారణ కొనసాగుతోంది.

Join WhatsApp

Join Now

Leave a Comment