షాకింగ్.. కూల్‌డ్రింక్‌లో బల్లి కాలు

షాకింగ్.. కూల్‌డ్రింక్‌లో బల్లి కాలు

కూల్‌డ్రింక్ (Cool Drink) తాగుతున్న సమయంలో బాటిల్లో బల్లి (Lizard) భాగం కనిపిస్తే మీకేమ‌నిస్తుంది.. ఎలా రియాక్ట్ అవుతారు..? అస‌లు ఊహించడానికే కష్టంగా ఉంది కదా.. అయితే సంగారెడ్డి (Sangareddy) జిల్లా పెద్దాపూర్‌లో ఈవిధమైన ఘ‌ట‌న రియ‌ల్‌గా జ‌రిగింది. ఓ హోట‌ల్‌ (Hotel) లోకి వెళ్లిన యువకులు థమ్స్ అప్ (Thums Up) తాగుతుండగా బాటిల్‌లో బల్లి కాలు (Lizard Leg) కనిపించి షాక్‌కు గురయ్యారు. వెంటనే హోటల్ సిబ్బందిని ప్రశ్నించి, వారితో వాదనకు దిగారు. ఈ సంఘటనతో ఒక యువకుడు అస్వస్థతకు గురై ఆస్ప‌త్రి (Hospital)లో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనపై బాధితులు ఫుడ్ సేఫ్టీ అధికారులకు (Food Safety Officials) ఫిర్యాదు చేశారు. ఘటనపై విచారణ చేపట్టిన అధికారులు హోటల్‌ను పరిశీలించడంతో ఉద్రిక్తత నెలకొంది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ సంఘ‌ట‌న‌కు సంబంధించిన మ‌రిన్ని వివ‌రాలు తెలియాల్సి ఉంది.

Join WhatsApp

Join Now

Leave a Comment