---Advertisement---

పవన్ కారణంగా ‘హరిహర వీరమల్లు’ వాయిదా?

పవన్ కారణంగా ‘హరిహర వీరమల్లు’ వాయిదా?
---Advertisement---

వచ్చే నెల 9న ‘హరిహర వీరమల్లు (Hari Hara Veera Mallu)’ సినిమాను థియేటర్లలో విడుదల చేస్తామని మేకర్లు ఇప్పటికే ప్రకటించారు. కానీ తాజా పరిస్థితుల్లో ఆ తేదీకి సినిమా విడుదల కుదిరే అవకాశాలు మందగించిన‌ట్లుగా తెలుస్తోంది. పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎం (AP Deputy CM) బాధ్యతలతో బిజీ (Busy) గా ఉండటంతో, ఈ వారంలో తన భాగస్వామ్య సన్నివేశాల్ని పూర్తి చేయాలనే ఉద్దేశంతో ఉన్నారు. కానీ, ఊహించని విధంగా ఆయన కుమారుడు మార్క్ శంకర్ గాయపడడంతో షూటింగ్ (Shooting) వాయిదా (Postponed) పడింది. పవన్ సీన్లు ఈ సినిమాలో కీలకమైనవిగా భావిస్తున్న నేపథ్యంలో, మే 9న రిలీజ్ చేయగలమా అనే ఆందోళన మేకర్లలో కనిపిస్తోందని టాలీవుడ్ కాంపౌండ్ టాక్‌. ప్రస్తుతం అభిమానులు మరియు పరిశ్రమ వర్గాలు విడుదల తేదీపై స్పష్టత కోసం ఎదురు చూస్తున్నాయి. త్వరలోనే అధికారిక ప్రకటన రానుందని సమాచారం.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment