నెల్లూరు జిల్లా (Nellore District) టీపీగూడూరు మండలంలోని అనంతపురం వాటర్ బేస్ (Ananthapuram Water Base)లో అమోనియా గ్యాస్ (Ammonia Gas) లీక్ (Leak) కావడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. ప్రమాదం జరిగిన సమయంలో అక్కడ పనిచేస్తున్న కార్మికులు ఊపిరాడక ఇబ్బందులు పడుతూ భయంతో పరుగులు తీశారు. గ్యాస్ లీక్ కారణంగా దాదాపు 10 మంది కార్మికులు (Workers) అస్వస్థత (Illness) కు గురైనట్లు తెలుస్తోంది.
వెంటనే బాధితులను సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. చుట్టుపక్కల గ్రామాలకు అమోనియా గ్యాస్ వ్యాపిస్తోంది. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది అప్రమత్తమై గ్యాస్ లీక్‌ను అదుపు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. మాస్కులు ధరించిన స్థానికులు, భయాందోళనకు గురవుతున్నారు. కాగా, అమోనియా లీక్ ఎందుకు జరిగిందన్న విషయంపై పూర్తి సమాచారం ఇంకా అందాల్సి ఉంది.







