కాబోయే అల్లుడితో అత్త జంప్‌

కాబోయే అల్లుడితో అత్త జంప్‌

మ‌రో ఆరు రోజుల్లో పెళ్లి.. ఇరు కుటుంబాలు వివాహానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లలో మునిగిపోయాయి. బంధువుల‌కు ఆహ్వాన ప‌త్రిక‌లు, షాపింగ్, న‌గ‌ల కొనుగోలు ఇలా అంతా స‌వ్యంగా జ‌రుగుతున్న స‌మ‌యంలో రెండు కుటుంబాల‌కు షాక్ ఇచ్చే సంఘ‌ట‌న జ‌రిగింది. కాబోయే అల్లుడు (Son-In-Law)తో అత్త (Mother-In-Law) ప‌రారైంది. ఈ విచిత్ర సంఘ‌ట‌న‌ ఉత్తరప్రదేశ్‌ (Uttar Pradesh) లోని అలీఘర్ జిల్లాలో జ‌రిగింది. ఈ ఘటన రెండు కుటుంబాల్లో కలకలం రేపింది.

ఆభరణాలు, నగదుతో పరారైన జంట
అలీఘర్‌కు చెందిన అనితా దేవి కుమార్తె (Anita Devi Daughter)కు రాహుల్ (Rahul) అనే యువ‌కుడితో పెళ్లి నిశ్చయమైంది. ఈనెల 16న వీరిపెళ్లి డాడోన్ ప‌రిధిలో జ‌ర‌గాల్సి ఉంది. కాగా, అనితా దేవి కాబోయే అల్లుడు రాహుల్‌తో ఇంటి నుంచి పారిపోయింది (Ran Away). వెళ్తూ రూ.3 లక్షల నగదు, రూ.5 లక్షల విలువైన ఆభరణాలను కూడా తీసుకెళ్లినట్లు సమాచారం. కుమార్తె పెళ్లి సిద్ధం చేసిన న‌గ‌దు, న‌గ‌లు ఎత్తుకెళ్లింద‌ని వ‌ధువు కుటుంబ స‌భ్యులు ఆరోపిస్తున్నారు.

వధువు తండ్రికి అనుమానం వ‌చ్చినా..
వధువు తండ్రి జితేంద్ర కుమార్ (Jitendra Kumar) మాట్లాడుతూ, “నా భార్య అనితా దేవి మా కుమార్తె కాబోయే భర్త రాహుల్‌తో తరచూ గంటల తరబడి ఫోన్‌ (Phone) లో మాట్లాడేది. కానీ, నేను ఎప్పుడూ అనుమానించ‌లేదు. ఇలా జ‌రుగుతుంద‌ని అనుకోలేదు. ఆమె నా కుటుంబాన్ని మోసం చేసింది” అని వాపోయారు.

ముందుగా వేసుకున్న ప్లాన్ ప్ర‌కార‌మే రాహుల్‌, అనితాదేవి ప‌రార‌య్యార‌ని పోలీసులు తేల్చారు. వివాహానికి ముందే అత్తగారు వరుడితో కలిసి పారిపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ ఘటనపై మద్రక్ పోలీస్ స్టేషన్‌ (Madharak Police Station) లో కేసు నమోదైంది. పరారైన జంట కోసం ప్రత్యేక గాలింపు బృందాన్ని ఏర్పాటు చేసినట్లు అధికారులు వెల్లడించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment