విజయనగరం (Vizianagaram) రైల్వే స్టేషన్లో బుధవారం నాగావళి ఎక్స్‌ప్రెస్ (Nagavali Express) పట్టాలు తప్పిన (Derailed) ఘటన కలకలం రేపింది. బొబ్బిలి (Bobbili) వైపు ప్రయాణిస్తుండగా రైలులోని చివరి రెండు బోగీలు వెంకటలక్ష్మీ థియేటర్ జంక్షన్ (Venkatalakshmi Theater Junction) వద్ద పట్టాలు తప్పాయి. అయితే, రైలు నెమ్మదిగా ప్రయాణిస్తుండటంతో ఎటువంటి ప్రాణనష్టం (Casualties) జరగలేదు. ఈ ఘటనతో ప్రయాణికులు తీవ్రంగా భయపడినా, ఎవరూ గాయపడకపోవడంతో ఊపిరిపీల్చుకున్నారు. రైల్వే అధికారులు వెంటనే స్పందించి, పట్టాలు తప్పిన బోగీలను తొలగించారు. మరమ్మతులు చేపడుతున్నారు.
News Wire
-
01
జమ్మలమడుగులో లారీ బీభత్సం
ఒక్కసారిగా గొర్రెల మందపైకి దూసుకెళ్లిన లారీ. గొర్రెల కాపరితో పాటు 20 గొర్రెలు మృతి. మరొకరి పరిస్థితి విషమం, ఆస్పత్రికి తరలింపు
-
02
వాయవ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం
కోస్తా జిల్లాలకు భారీ వర్షసూచన. ఏపీలోని 7 జిల్లాలకు ఎల్లో అలెర్ట్. అల్లూరి, ఏలూరు, ప.గో., ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం
-
03
ఢిల్లీలో ఏపీ విద్యార్థి దారుణ హత్య
పల్నాడు జిల్లా చిలకలూరిపేటకు చెందిన దీపక్ కుమార్. దీపక్ కుమార్ ను కాల్చి చంపిన తోటి స్నేహితుడు దేవాంశ్. తలకు బుల్లెట్ తగలడంతో అక్కడికక్కడే మృతి
-
04
కూటమి సభకు విద్యార్థులను ట్రాక్టర్లతో తరలింపు
వెంకట్రావుపల్లి ఇంటిగ్రేటెడ్ బాయ్స్ హాస్టల్ నుండి స్కూల్ కు వెళ్ళడానికి బస్సు కరువు. విద్యార్థులను ట్రాక్టర్లలో పాఠశాలకు తరలిస్తున్న వైనం.
-
05
తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ లో ప్రయాణికుల అవస్థలు..
కూటమి సభకు ఆర్టీసీ బస్సులను తరలించడంతో ప్రయాణికుల ఇక్కట్లు. బస్సులు లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులు
-
06
సీతారామాంజనేయులు సస్పెన్షన్ పొడిగింపు
ముంబై నటి జత్వాని కేసులో 2026 మార్చి 8 వరకు పీఎస్ఆర్ సస్పెన్షన్ పొడిగింపు
-
07
కాసేపట్లో ఉపరాష్ట్రపతి ఎన్నికల పోలింగ్
కొత్త పార్లమెంట్ భవన్ లో ఉపరాష్ట్రపతి ఎన్నిక. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్. ఎన్డీయే అభ్యర్తి రాధాకృష్ణన్ కు 439 మంది ఎంపీల మద్దతు
-
08
కేంద్రమంత్రి పీయూష్ గోయల్‌తో వైసీపీ ఎంపీల భేటీ
భేటీలో పాల్గొన్న లోక్‌సభ పక్ష నేత మిథున్‌రెడ్డి,అయోధ్య రామిరెడ్డి, సుబ్బారెడ్డి. ఉపరాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో భేటీకి ప్రాధాన్యం
-
09
వైసీపీ యూరియా కొరతపై అన్నదాత పోరు కార్యక్రమం
నేడు అన్నదాత పోరుకు అనుమతి లేదంటు పోలీసులు నిబంధనలు. అనకాపల్లి జిల్లాలో వైఎస్ఆర్ సీపీ నేతల హౌస్ అరెస్ట్‌లు.
-
10
మాజీ MLA కాసు మహేష్‌రెడ్డి హౌస్ అరెస్ట్
నరసరావుపేటలోని ఇంటి దగ్గర పోలీసుల మోహరింపు. వైఎస్ఆర్ సీపీ రైతు ర్యాలీకి అనుమతి లేదంటున్న పోలీసులు