లాక్మే ఫ్యాషన్ వీక్ (Lakmé Fashion Week) లో బాలీవుడ్ (Bollywood) నటి జాన్వీ కపూర్ (Janhvi Kapoor) తన హొయలతో అందరినీ ఆకట్టుకున్నారు. షో టాపర్ గా ర్యాంప్‌పై వాక్ చేసిన ఆమె స్టన్నింగ్ లుక్స్‌తో మెరిసిపోయారు. ఈ క్షణాలను క్యాప్చర్ చేసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అయితే, జాన్వీ ర్యాంప్ వాక్ (Ramp Walk) స్టైల్ నెటిజన్లకు పెద్దగా నచ్చలేదు. కొందరు “జాన్వీ.. మీరు ఎందుకు పరిగెడుతున్నట్లున్నారు?” అంటూ సెటైర్లు వేస్తూ కామెంట్లు చేస్తున్నారు. ఈ ట్రోలింగ్ (Trolling)కు ఆమె ఎలా స్పందిస్తుందో చూడాలి.
ఈ ర్యాంప్ వాక్‌లో అందరి దృష్టిని ఆకర్షించిన బాలీవుడ్ బ్యూటీ, షోకు హాజరైన ఓ పెద్దావిడను ఆలింగనం (Hug) చేసుకుంది. దీంతో జాన్వీ కపూర్‌కు అప్యాయంగా ముద్దు పెట్టిన ఈ మహిళ ఎవరూ? అంటూ నెటిజన్లు తెగ ఆరా తీస్తున్నారు. ప్రముఖ బిలియనీర్ ముఖేశ్ అంబానీ (Mukesh Ambani), నీతా అంబానీ (Nita Ambani)ల పెద్ద కోడలు కుమార్తె శ్లోకా మెహతా (Shloka Mehta) తల్లి అని తెలుస్తోంది.