బీజేపీలో చేరిన తానా ఫౌండేషన్‌ ఛైర్మన్‌ యార్లగడ్డ

బీజేపీలో చేరిన తానా ఫౌండేషన్‌ ఛైర్మన్‌ యార్లగడ్డ

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ఫౌండేషన్‌ ఛైర్మన్‌, ఎన్నారై యార్లగడ్డ వెంకటరమణ (Yarlagadda Venkata Ramana) బీజేపీ (BJP) గూటికి చేరారు. ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి (Daggubati Purandeswari) సమక్షంలో ఆయన పార్టీలో చేరారు. ఈ సందర్భంగా పురంధేశ్వరి యార్లగడ్డకు పార్టీ కండువా కప్పి సాదర స్వాగతం పలికారు. ఈ సంద‌ర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ (Narendra Modi) ఆశయాలు నచ్చి బీజేపీలో చేరినట్లు యార్లగడ్డ వెంకటరమణ వెల్లడించారు. రాష్ట్రంలో బీజేపీ బలోపేతానికి కృషి చేస్తానని తెలిపారు. గుంటూరు జిల్లా రేపల్లె (Repalle) కు చెందిన ఆయన గతంలో వైసీపీ (YCP) లో చేరారు, కానీ గత ఎన్నికల తర్వాత రాజకీయాలకు దూరంగా ఉన్నారు.

తానా ఫౌండేషన్‌ (TANA Foundation) ఛైర్మన్‌గా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించిన యార్లగడ్డ, ఇప్పుడు మళ్లీ బీజేపీ ద్వారా రాజకీయంగా క్రియాశీలకంగా మారాలని నిర్ణయించుకున్నారు. రాష్ట్ర రాజకీయాల్లో బీజేపీకి ఈ చేరిక ఎంతవరకు బలాన్ని చేకూరుస్తుందో చూడాలి.

Join WhatsApp

Join Now

Leave a Comment