“పుతిన్ త్వరలో చనిపోతారు” – జెలెన్ స్కీ సంచలన వ్యాఖ్యలు

"పుతిన్ త్వరలో చనిపోతారు" – జెలెన్ స్కీ సంచలన వ్యాఖ్యలు

Summarize with AI

ఉక్రెయిన్ (Ukraine) అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్ స్కీ (Volodymyr Zelenskyy) మరోసారి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ (Vladimir Putin) గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే పుతిన్ చనిపోతారు. పుతిన్ చావు (Putin’s death) యుద్ధం ముగింపుకు దారి తీస్తుంది అని ఆయన అన్నారు. పారిస్‌ (Paris) లో జరిగిన ఒక ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేయడంతో ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి.

పుతిన్ ఆరోగ్యంపై ఊహాగానాల నేపథ్యం
ఇప్పటికే పుతిన్ ఆరోగ్యం గురించి అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. గతంలో పార్కిన్సన్ వ్యాధి (Parkinson’s Disease) , క్యాన్సర్ (Cancer) ఉన్నట్లు పుకార్లు వచ్చినా, క్రెమ్లిన్ (Kremlin) వాటిని ఖండించింది. పుతిన్ చేతులు, కాళ్లు అసంకల్పితంగా కదలడం, అతను నిరంతరం దగ్గుతున్నట్లు వీడియోల్లో కనిపించడం ఆ దేశ ప్ర‌జ‌ల‌ను ఆందోళన కలిగించింది. 2022లో జరిగిన రక్షణ మంత్రి (Defense Minister) తో సమావేశంలో టేబుల్ పట్టుకుని వంగి కూర్చున్న వీడియో వైరల్ కావడంతో ఆరోగ్యంపై మరింత అనుమానాలు పెరిగాయి.

రష్యా వైఖరిపై జెలెన్ స్కీ ఆగ్రహం
జెలెన్ స్కీ అభిప్రాయం ప్రకారం.. రష్యా (Russia) ఈ యుద్ధాన్ని మరింత పెద్దదిగా మార్చాలని చూస్తోందని, శాంతి చర్చలు జరుగుతున్నప్పటికీ, యుద్ధాన్ని కొనసాగించాలనే ఉద్దేశ్యంతో రష్యా ముందుకు సాగుతోందని ఆరోపించారు. ప్రపంచ దేశాలు (World Nations) యుద్ధాన్ని ముగించేందుకు ఒత్తిడి చేయాలని జెలెన్ స్కీ కోరారు. మరోవైపు, రష్యా-ఉక్రెయిన్ (Russia-Ukraine) అధికారులు సౌదీ అరేబియా (Saudi Arabia) లోని జెడ్డా (Jeddah) వేదికగా శాంతి చర్చలు నిర్వహిస్తున్నారు. ఈ యుద్ధం త్వరగా ముగించాలని రష్యా కూడా ఆసక్తిగా ఉందని, అయితే తగిన రాజకీయ ప్రయోజనాలు సమకూరే వరకు వారు వెనక్కి తగ్గే అవకాశం లేదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment