బిహార్‌లో సంచలనం.. తండ్రీకూతుర్ని కాల్చి చంపి.. ఆపై ఆత్మహత్య

బిహార్‌లో సంచలనం.. తండ్రీకూతుర్ని కాల్చి చంపి.. ఆపై ఆత్మహత్య

బిహార్‌ (Bihar)లోని అరా రైల్వే స్టేషన్‌లో(Ara Railway Station) మంగళవారం జరిగిన దారుణ ఘటన (Tragic Incident) కలకలం రేపింది. ఓ యువకుడు 16 ఏళ్ల బాలికను, ఆమె తండ్రిని కాల్చిచంపి.. అనంతరం తాను కూడా ఆత్మహత్యకు(Suicide) పాల్పడ్డాడు. పోలీసుల వివరాల ప్రకారం.. అరా రైల్వే స్టేషన్‌లోని ఫుట్ ఓవర్ బ్రిడ్జిపై (Foot Over Bridge) ఈ ఘటన చోటు చేసుకోగా, నిందితుడు (Accused) అమన్ కుమార్‌ (Aman Kumar) త‌న వెంట తెచ్చుకున్న తుపాకీతో అనీల్ సింగ్ (Anil Singh) (తండ్రి), జియా కుమారి (Jiya Kumari) (16)పై కాల్పుల‌కు తెగ‌బ‌డ్డారు. మొదట అమ్మాయిని, ఆపై ఆమె తండ్రిని కాల్చి, చివరగా తానే తనపై తుపాకీతో కాల్చుకొని ప్రాణాలు తీసుకున్నాడు.

ప్రేమ వ్యవహారమే కారణమా?
ఈ ఘటన వెనుక ప్రేమ వ్యవహారం (Love Affair) ఉందని పోలీసులు భావిస్తున్నారు. మృతదేహాలను పోస్ట్‌మార్టం (Post-Mortem) నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఘటనాస్థలంలో ఫోరెన్సిక్ నిపుణులు (Forensic Experts) ఆధారాలు సేకరిస్తున్నారు. ఆ బాలిక ఢిల్లీకి (Delhi) వెళ్లేందుకు స్టేషన్‌కు వచ్చిందని సమాచారం. ప్రేమ వ్యవహారం, కుటుంబ గొడవలు ప్రధాన కారణాలుగా అనుమానిస్తుండగా, పోలీసుల విచారణ(Police Investigation) తర్వాత పూర్తి విషయాలు వెల్లడి కానున్నాయి.

Join WhatsApp

Join Now

Leave a Comment