వైసీపీ (YCP) సీనియర్ నేత, మాజీ మంత్రి కొడాలి నాని (Kodali Nani) అస్వస్థత (Illness) కు గురయ్యారు. గ్యాస్ట్రిక్ సమస్యలతో బాధపడుతున్న ఆయన్ను కుటుంబ సభ్యులు హైదరాబాద్ (Hyderabad)లోని ఏఐజీ ఆసుపత్రి (AIG Hospital) కి తరలించారు. ఇప్పటికే డాక్టర్లు ఆయనకు పలు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లుగా సమాచారం. ఆయన ఆరోగ్య పరిస్థితిపై హెల్త్ బులిటెన్ (Health Bulletin) విడుదల కావాల్సి ఉంది. తీవ్రమైన మానసిక ఒత్తిడితోనే ఆయన అస్వస్థతకు గురైనట్లుగా తెలుస్తోంది. ఇటీవల ఆయనపై వేధింపులు తీవ్రమైనట్లుగా కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Kodali Nani : కొడాలి నానికి అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు
