నా కూతుర్ని మాయచేసింది.. లేడీ అఘోరీపై పోలీసులకు ఫిర్యాదు

తెలుగు రాష్ట్రాల్లో లేడీ అఘోరీ పేరిట సంచలనం సృష్టించిన వ్యక్తిపై మంగళగిరి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన తురిమెల్ల కోటయ్య తన కుమార్తె శ్రీ వర్షిణిని మాయమాటలతో మోసం చేసి అఘోరీ తీసుకెళ్ళిందని ఫిర్యాదు చేశారు.

ఏం జరిగింది అంటే..
బాధిత కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. నాలుగు నెలల క్రితం నేషనల్ హైవే మీద ఒంటిపై బట్టలు లేకుండా తిరుగుతున్న ‘లేడీ అఘోరీ’కి పోలీసులు దుస్తులు కప్పాలని సూచించారు. ఆ సమయంలో ఇంజినీరింగ్ చదువుతున్న శ్రీ వర్షిణి ధైర్యంగా వెళ్లి అఘోరీ ఒంటిపై దుస్తులు కప్పింది. అప్పటి నుంచి అఘోరీ ఆమెను టార్గెట్ చేసి, ఫోన్ నెంబర్ తీసుకుని మాట్లాడటం ప్రారంభించింది. కొంతకాలం గడిచిన తర్వాత ఆ యువతిని మాయమాటలు చెప్పి ఆకుపసరుతో లేపనాలు పూసి వశీకరణ చేశాడు. అఘోరీ ఆశ్రమానికి యువరాణిగా మారుస్తానంటూ తనవైపు తిప్పుకుందని తండ్రి వాపోయారు.

పోలీసుల స్పందన?
తన కుమార్తె లేడీ అఘోరీ మాయలో చిక్కుకుందని, ఇప్పుడు తమ మాట వినడం లేదని బాధిత తండ్రి కోటయ్య ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా, కేసు నమోదు చేయడం లేదని ఆరోపించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment