71వ జాతీయ చలనచిత్ర పురస్కారాల ప్రదానోత్సవం

ఘనంగా 71వ జాతీయ చలనచిత్ర పురస్కారాల ప్రదానోత్సవం

2025లో 71వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవం ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో అట్టహాసంగా జరిగింది. 2023 సంవత్సరానికి గాను ఉత్తమ ప్రతిభ కనబరిచిన చిత్రాలకు, నటీనటులకు, సాంకేతిక నిపుణులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా పురస్కారాలు అందజేశారు. ఈ వేడుకలో దక్షిణాది, ఉత్తరాది సినీ పరిశ్రమలకు చెందిన విజేతలు సందడి చేశారు.

అవార్డు విజేతలు వీరే:

ఉత్తమ చిత్రం: ’12th ఫెయిల్’ (హిందీ)

ఉత్తమ నటుడు: షారుఖ్ ఖాన్ (‘జవాన్’ చిత్రానికి), విక్రాంత్ మసీహ్ (’12th ఫెయిల్’ చిత్రానికి)

ఉత్తమ నటి: రాణి ముఖర్జీ

ఉత్తమ తెలుగు చిత్రం: ‘భగవంత్ కేసరి’ (నందమూరి బాలకృష్ణ నటించిన చిత్రం)

ఉత్తమ బాలనటి: సుకృతి వేణి (సుకుమార్ కుమార్తె, ‘గాంధీతాత చెట్టు’ చిత్రానికి)

ఉత్తమ యాక్షన్ డైరెక్షన్: ‘హనుమాన్’ చిత్రం (యానిమేషన్, గేమింగ్ అండ్ కామిక్ విభాగంలో)

ఉత్తమ సాహిత్యం: ‘బలగం’ సినిమాలోని ‘ఊరు పల్లెటూరు’ పాటకు

ఉత్తమ స్క్రీన్‌ప్లే: ‘బేబీ’ చిత్రం

ఉత్తమ పురుష నేపథ్య గాయకుడు: రోహిత్

Join WhatsApp

Join Now

Leave a Comment