సూడాన్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. టేకాఫ్ అయిన కొద్ది సేపటికే ఓ సైనిక విమానం జనావాసాల్లో కుప్పకూలింది. ఈ విషాదకర ఘటనలో 46మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 10మంది తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. క్షతగాత్రులను దగ్గరిలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఆంటోనోవ్ ఎయిర్‌క్రాఫ్ట్ ఓమ్‌దుర్‌మాన్‌కు సౌత్‌లో ఉన్న వాడి సైద్నా ఎయిర్‌బేస్ నుండి టేకాఫ్ అవుతుండగా ఒప్పసారిగా కూలిపోయిందని మిలటరీ తీవ్ర ప్రకటనలో తెలిపింది. ఓమ్‌దుర్‌మాన్‌లోని కర్రారి జిల్లాలో ఒక ఇంటిపై విమానం కూలిపోవడంతో స్థానిక జనంతో పాటు మిలిటరీ సిబ్బంది మృతిచెందినట్లుగా తెలుస్తోంది. 46మంది ప్రాణాలు కోల్పోగా, 10మంది గాయపడినట్లు సమాచారం. అయితే, ఈ ప్రమాదానికి గల కారణాలపై ఇంకా స్పష్టత రాలేదు. అధికారులు సంఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.