కుంభమేళాలో తొక్కిస‌లాట‌.. 17 మంది మృతి

కుంభమేళాలో తొక్కిస‌లాట‌.. 17 మంది మృతి

ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం ప్ర‌యాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాలో ఘోర దుర్ఘటన చోటుచేసుకుంది. మౌని అమావాస్య సందర్భాన్ని పురస్కరించుకుని పుణ్యస్నానాలకు సంగమం వద్దకు లక్షలాది భక్తులు తరలివచ్చారు. అయితే, భక్తుల అధిక సంఖ్యతో బారికేడ్లు విరిగిపోవడంతో తొక్కిసలాట జరిగింది.

ఈ ఘటనలో 17 మంది భక్తులు మృత్యువాత పడ్డారు. పలువురికి తీవ్ర గాయాలైనట్లు సమాచారం. గాయపడినవారిని అంబులెన్స్‌ల ద్వారా సమీపంలోని ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. భక్తుల సంఖ్య మరింత పెరగడంతో పరిస్థితి అదుపు తప్పిందని అధికారులు పేర్కొన్నారు. ఈ సంఘటనపై విచారణకు ఆదేశాలు జారీ చేశారు. బాధితులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై ప్రధాన మంత్రి మోడీ, యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్‌ ఆరా తీశారు.

మౌనీ అమావాస్య సంద‌ర్భంగా కుంభ‌మేళాకు 10కోట్ల మంది భక్తులు వస్తారని అంచనా. భ‌క్తుల‌కు త‌గిన‌ట్లు ఏర్పాట్లు చేసిన‌ప్ప‌టికీ ఒక్క‌సారిగా తొక్కిస‌లాట జ‌రిగింది. 17 మంది చ‌నిపోగా, ప‌దుల సంఖ్య‌లో భ‌క్తులు గాయ‌ప‌డ్డారు. ఘటన స్థలికి అంబులెన్సులు వచ్చి గాయపడిన వారిని కుంభమేళా సెక్టార్‌ 2 కు తరలించారు. తొక్కిసలాట జరిగిన నేపథ్యంలో ఈరోజు అమృత స్నానాల‌ను ర‌ద్దు చేసిన‌ట్లు స‌మాచారం.

Join WhatsApp

Join Now

Leave a Comment