మంత్రి ఇలాకాలో 104 వాహనాల మాయం.. డంపింగ్ యార్డ్‌లో ధ్వంసం

మంత్రి ఇలాకాలో 104 వాహనాల మాయం.. డంపింగ్ యార్డ్‌లో ధ్వంసం

ప్ర‌జ‌ల‌కు మెరుగైన వైద్య సేవ‌లు అందించే 104 వాహ‌నాల‌కు సంబంధించి అన్నమయ్య జిల్లాలోని రాయచోటి ప్రభుత్వాసుపత్రిలో సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఇలాకా పరిధిలో ఉన్న రాయచోటిలో ప్రజలకు అత్యవసర వైద్య సేవలు అందించాల్సిన 104 అంబులెన్స్ వాహనాలు మాయమైన వాహ‌నాలు.. డంపింగ్ యార్డులో ధ్వంస‌మైన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది.

ఆరు నెలల తర్వాత పోలీసులకు ఫిర్యాదు
104 వాహ‌నాలు ధ్వంసం అయ్యాయ‌ని జిల్లా వైద్యాధికారి ఆరు నెలల తర్వాతే పోలీసులకు ఫిర్యాదు చేయడం అనుమానాలకు తావిస్తోంది. 104 వాహనాలను దొంగలించారంటూ ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కానీ, ఎవరి అనుమతి లేకుండానే కొంత మంది సిబ్బంది 104 వాహనాలను ప్రభుత్వాసుపత్రి ఆవరణ నుంచి డంపింగ్ యార్డుకు తరలించి ధ్వంసం చేయించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రజల ప్రాణాలను కాపాడాల్సిన అత్యవసర సేవల వాహనాలను ఇలా ధ్వంసం చేయడం తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తిస్తోంది.

వీడియో వైరల్.. సంచలనం
డంపింగ్ యార్డులో 104 వాహనాలను ధ్వంసం చేస్తున్న దృశ్యాలకు సంబంధించిన వీడియో ఒకటి వైరల్‌గా మారింది. ఈ వీడియోలో స్పష్టంగా 104 వాహనాలను పగులగొట్టి భాగాలను వేరు చేస్తున్న దృశ్యాలు కనిపించడంతో వ్యవహారం మరింత వివాదాస్పదంగా మారింది. ప్రభుత్వాసుపత్రి ఆవరణ నుంచి 104 వాహనాలు బయటకు వెళ్లాలంటే సిబ్బంది సహకారం లేకుండా సాధ్యమా? అన్న ప్రశ్న ఇప్పుడు ప్రధానంగా వినిపిస్తోంది. ఈ వ్యవహారంలో ఎవరు బాధ్యులు? అధికారుల నిర్లక్ష్యమా? లేక సిబ్బంది కుట్రా? అన్న అంశాలపై స్పష్టత రావాల్సి ఉంది.

వైఎస్ జ‌గ‌న్ హయాంలో గ్రామాల‌కు వెళ్లి అనారోగ్యం బారిన‌ప‌డిన ప్ర‌జ‌ల‌కు మెడిసిన్ ఉచితంగా అందించ‌డంతో పాటు వారికి ఉచితంగా వైద్య స‌దుపాయాలు అందించే ఆలోచ‌న‌లో భాగంగా 104 వాహ‌నాల‌ను స‌మ‌కూర్చారు. ప్ర‌జ‌ల ఆరోగ్యం కోసం ఉప‌యోగించే ఈ వాహ‌నాల కొనుగోలుకు కోట్ల రూపాయ‌లు ఖ‌ర్చు చేశారు. అలాంటి వాహ‌నాల‌న దొంగ‌లించి, ఎవ‌రి కంట ప‌డ‌కుండా డంపింగ్ యార్డులో ధ్వంసం చేయ‌డంపై అనుమానాలు రేకెత్తుతున్నాయి.

Join WhatsApp

Join Now

Leave a Comment