వాలెంటైన్ డే సందర్భంగా టీమిండియా స్టార్ ప్లేయర్ యుజ్వేంద్ర చాహల్ తన సోషల్ మీడియా ఖాతాలో భావోద్వేగపూరిత పోస్ట్ చేశారు. “నువ్వు నీలాగే ఉండు.. నీ జీవితాన్ని మార్చే ఛాన్స్ ఇతరులకు ఇవ్వకు” అని ఆయన రాసిన ఈ సందేశం ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరలవుతోంది. ఇదిలా ఉండగా, చాహల్-ధనశ్రీ విడాకులపై రూమర్స్ ఊపందుకున్న నేపథ్యంలో, ఆయన ఈ విధంగా పోస్ట్ చేయడం నెట్టింట చర్చనీయాంశంగా మారింది.
ఈ పోస్ట్ ద్వారా ఆయన ఏమైనా సంకేతాలు ఇస్తున్నారా? లేదా, సాధారణంగా ఇచ్చిన సందేశమేనా? అనేది అభిమానులు చర్చించుకుంటున్నారు. తన వ్యక్తిగత జీవితానికి సంబంధించే చాహల్ ఈ పోస్టు పెట్టి ఉంటాడని నెటిజన్లు భావిస్తున్నారు. విడాకుల రూమర్స్ తీవ్రమవ్వడంతో చాహల్ తాజాగా మరో పోస్టు పెట్టాడు. సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు నిజం కావచ్చు.. కాకపోవచ్చని ఆ పోస్టులో రాసుకొచ్చాడు.