టీమిండియా స్టార్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్(Yuzvendra Chahal) ఆయన భార్య ధనశ్రీ వర్మ(Dhanashree Verma) విడాకుల గురించి కొన్ని రోజులుగా వార్తలు(Chahal Divorce) హల్‌చల్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో చాహల్ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా పెట్టిన ఒక పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. “నియంత్రించలేనంత గందరగోళ పరిస్థితుల్లో ఉన్నప్పుడు, దయతో ఉండటమే అన్నింటికంటే మంచిపని” అని రాసి పోస్టు చేశారు.
ఈ సందేశం విభిన్న అర్థాలను సూచించేలా ఉండటంతో చాహల్ వ్యక్తిగత జీవితం గురించి చర్చలు మరింత వేడెక్కాయి. విడాకులు కన్ఫామ్ అనే చర్చ జోరుగా సాగుతోంది. ముంబైలోని బాంద్రా ఫ్యామిలీ కోర్టులో చాహల్-ధనశ్రీ విడాకుల కేసుపై తుది విచారణ ఇటీవల జరిగినట్లు సమాచారం.
ఇప్పటి వరకు చాహల్ గానీ, ధనశ్రీ గానీ విడాకుల అంశంపై అధికారికంగా స్పందించలేదు. అయితే, సోషల్ మీడియాలో వీరి బంధం తెగిపోయిందంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి.