విడాకుల వార్తపై భారత క్రికెటర్ చాహల్ స్పందించారు. తన భార్య ధనశ్రీతో విడిపోతున్నట్లు సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై ఆయన తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఒక ప్రకటన విడుదల చేశారు. అభిమానులందరికీ ధన్యవాదాలు తెలుపుతూ “మీ మద్దతు వల్లనే నేను ఇంత దూరం వచ్చాను. ఇంకా నా ప్రయాణం కొనసాగుతోంది” అని పేర్కొన్నారు. చాహల్ తన ప్రకటనలో.. “మీరు నా వ్యక్తిగత జీవితంపై ఆసక్తి చూపించే దానిని అర్థం చేసుకోగలను. అయితే, దయచేసి ఈ విషయంపై సోషల్ మీడియాలో వదంతులు వ్యాప్తి చేయకండి. మీరు ఇచ్చిన మద్దతుతోనే నేను ఇంతటి స్థాయిలో ఉన్నాను, నాకు మీ ఆదరాభిమానాలు చాలా అవసరం” అని కోరారు.
చాహల్ తన భార్య ధనశ్రీ వర్మ దూరం పెరిగిందని, త్వరలో విడాకులు తీసుకుంటున్నారని ఇటీవల జాతీయ మీడియా కూడా వార్తా కథనాలు అందించింది. సోషల్ మీడియాలో చాహల్ లేట్ నైట్ పార్టీ వీడియోలు కూడా హల్చల్ చేసిన సంగతి తెలిసిందే.