---Advertisement---

మరో క్రికెటర్ జంట విడిపోనుందా..?

మరో క్రికెటర్ జంట విడిపోనుందా..?
---Advertisement---

సెలబ్రిటీ జంట‌ల‌ విడాకులు ఈ మ‌ధ్య కామ‌న్ అయిపోతున్నాయి. క్రికెట్ రంగంలో కూడా ఇలాంటి వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. తాజాగా భారత క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్, సతీమణి ధనశ్రీ విడాకుల దిశగా అడుగులు వేస్తున్నారని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

చాహల్-ధనశ్రీ విడిపోతారనే ఊహాగానాలు పెళ్లిరోజున ఒకరికొకరు విష్ చేయకపోవడంతో మొదలయ్యాయి. ఇదే అంశంపై సినీ విమర్శకుడు కమల ఆర్ ఖాన్ స్పందిస్తూ, ఈ జంట ఇప్పటికే విడిపోయిందని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అయితే, ఈ విషయంపై ధనశ్రీ లేదా చాహల్ అధికారిక ప్రకటన ఇవ్వకపోవడంతో అభిమానులు ఇంకా స్పష్టత కోసం వేచి చూస్తున్నారు.

భార‌త పేస‌ర్ మ‌హ్మ‌ద్ ష‌మీ, స్టార్ ఆల్ రౌండ‌ర్ హార్దిక్ పాండ్యా జంటలు విడిపోయిన సంగ‌తి తెలిసిందే. తాజాగా చాహ‌ల్‌-ధ‌న‌శ్రీ జంట కూడా విడిపోతార‌నే ప్ర‌చారం జోరుగా సాగుతోంది.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment