వ‌క్ఫ్ బిల్లుకు వైసీపీ వ్య‌తిరేకం.. సంచ‌ల‌న వీడియో రిలీజ్‌

వ‌క్ఫ్ బిల్లుకు వైసీపీ వ్య‌తిరేకం.. సంచ‌ల‌న వీడియో రిలీజ్‌

వక్ఫ్ సవరణ బిల్లు (Waqf Amendment Bill) పార్ల‌మెంట్ ఉభ‌య‌స‌భ‌ల్లోనూ ఆమోదం (Approval) పొందింది. ఈ బిల్లుకు కూట‌మి పార్టీలు సంపూర్ణ మ‌ద్ద‌తు ఇచ్చాయి. తాజాగా వైసీపీ (YCP) సైతం బిల్లుకు స‌పోర్టు చేసింద‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ నేప‌థ్యంలో వైసీపీ సంచ‌ల‌న వీడియో (Sensational video) ను బ‌య‌ట‌పెట్టింది. ముస్లింల‌ను త‌ప్పుదోవ‌ప‌ట్టించేందుకు ఒక వ‌ర్గం మీడియా కావాల‌నే త‌ప్పుడు ప్ర‌చారానికి తెర‌తీసింద‌ని స్ప‌ష్టం చేసింది. ఇందుకు సంబంధించిన ఆధారాల‌ను బ‌య‌ట‌పెడుతూ వైసీపీ ట్వీట్ (YCP Tweet) చేసింది.

2025 వక్ఫ్ సవరణ బిల్లుకు సంబంధించి తమ పార్టీ రాజ్యసభ సభ్యులకు విప్ జారీ చేయలేదని ఒక వర్గం మీడియా, కొన్ని సోషల్ మీడియా హ్యాండిల్స్ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని వైసీపీ తీవ్రంగా ఖండించింది. రాజ్యసభ సభ్యులందరూ సభలో హాజరు కావాలని, వక్ఫ్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా (Against The Bill) ఓటు (Vote) వేయాలని వైసీపీ పార్లమెంటరీ పార్టీ స్పష్టమైన మరియు అధికారిక విప్ జారీ చేసిందని స్పష్టం చేసింది. ప్రజలను తప్పుదారి పట్టించే, వాస్తవాలను వక్రీకరించే ప్రయత్నాలను తీవ్రంగా ఖండిస్తున్న‌ట్లుగా ట్వీట్‌లో పేర్కొంది. లౌకిక విలువలకు వైసీపీ తన అచంచలమైన నిబద్ధతను పునరుద్ఘాటిస్తుందని పేర్కొంది. నిరాధారమైన ఊహాగానాలను ప్రసారం చేసే ముందు వాస్తవాలను ధృవీకరించాలని ప్ర‌చార మాధ్యమాల‌కు సూచించింది.

బిల్లుకు సంపూర్ణ మ‌ద్ద‌తు ఇచ్చిన కూట‌మి ప్ర‌భుత్వంపై ముస్లిం మైనార్టీలు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తుండ‌గా, చంద్ర‌బాబు డైవ‌ర్ష‌న్ పాలిటిక్స్‌ (Chandrababu Diversion Politics) లో భాగంగా వైసీపీపై త‌ప్పుడు ప్ర‌చారం చేస్తున్నార‌ని ఆ పార్టీ నేత‌లు మండిప‌డుతున్నారు. అనుకూల మీడియా ద్వారా త‌మ పార్టీపై దుష్ప్ర‌చారం చేయిస్తున్నార‌ని, రాజ్య‌స‌భ‌ (Rajya Sabha) లో ఎంపీ వైవీ సుబ్బారెడ్డి (MP Y.V. Subba Reddy) మాట్లాడిన వీడియోను సైతం వైసీపీ విడుద‌ల చేసింది.

Join WhatsApp

Join Now

Leave a Comment