తిరుమల ఏడు కొండలపై నటుడు, తెలుగుదేశం పార్టీ మాజీ ఎంపీ మురళీ మోహన్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇటీవల ప్రముఖ యూట్యూబ్ ఛానల్‌కు ఇంటర్వ్యూ ఇస్తూ ఏడుకొండలపై అవాస్తవాలు మాట్లాడారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్‌పై పెద్ద నింద మోపారు. కానీ, మురళీ మోహన్ మాటలకు సామాజిక మాధ్యమాల్లో ఆధారాలతో కౌంటర్లు పడుతున్నాయి.
మురళీమోహన్ ఏమన్నారంటే..
తిరుమలకు ఏడు కొండలు ఎందుకు మూడు కొండలు చాలు. నాలుగు కొండల్లో చర్చి కడతానని వైఎస్సార్ అన్నారు. ఆ మరుసటి రోజు ఆయన చనిపోయారంటూ నోటిదురుసు తనం ప్రదర్శించారు. చనిపోయిన వైఎస్సార్‌పై భారీ నిందవేసిన మురళీ మోహన్‌పై ఇటు తెలంగాణలోనూ, అటు ఆంధ్రప్రదేశ్‌లోనూ ఉన్న వైఎస్సార్ ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
వాస్తవాలు వెలికితీత..
తిరుమల కేవలం రెండు కొండలకే పరిమితం కాదని, ఏడుకొండలు కూడా తిరుమల పరిధిలోకి వస్తాయని, ఆ పుణ్యక్షేత్రంలో ఎన్నికలు జరపకూడదని, అన్యమత ప్రచారం చేయకూడదని, ముఖ్యమంత్రి హోదాలో వైఎస్సార్ 2007 జూన్ 2వ తేదీన జీఓ 746 జారీ చేశారు. ఆ ఆధారాలను సోషల్ మీడియా వేదికగా ప్రదర్శిస్తూ మురళీ మోహన్‌ను ప్రశ్నిస్తున్నారు. మురళీ మోహన్ వ్యాఖ్యలను వైఎస్సార్ అభిమానులు తీవ్రంగా ఖండించారు. వాస్తవాలు తెలుసుకొని మాట్లాడూ అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి వాస్తవాలు తెలుసుకొని మురళీమోహన్ వైఎస్సార్ అభిమానులకు క్షమాపణలు చెప్తారా..? అని వేచి చూడాల్సిందే.

వెంకన్న చౌదరి అంటూ దేవుడికి కులం ఆపాదించి..
గతంలో తెలుగుదేశం పార్టీ ఎంపీగా ఉన్న సమయంలో మీడియా ముఖంగా మురళీ మోహన్ తిరుమల శ్రీస్వామివారికి కులాన్ని ఆపాదించారు. వెంకన్న చౌదరి అంటూ కలియుగ దైవం శ్రీవేంకటేశ్వరస్వామికి ఒక వర్గానికి చెందిన దేవుడిగా ఆయన చిత్రీకరించే ప్రయత్నం చేయగా, అప్పట్లో శ్రీవారి భక్తులు మురళీ మోహన్‌పై ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.