CMRF స్కామ్.. బయటపడ్డ టీడీపీ నేతల కొత్త నాటకం (Video)

CMRF స్కామ్.. బయటపడ్డ టీడీపీ నేతల కొత్త నాటకం (Video)

ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) నిధుల్లో అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న టీడీపీ (Telugu Desam Party) అనుబంధ విభాగం టీఎన్‌ఎస్‌ఎఫ్‌ (TNSF) నాయకులు, ఇప్పుడు ఆ వ్యవహారం నుంచి తప్పించుకోవడానికి కొత్త నాటకాలకు తెరలేపారు. బాధితులకు అందాల్సిన నిధులను కొట్టేయడమే కాకుండా, ఇప్పుడు వాటిని ‘అప్పు’గా చిత్రీకరించే ప్రయత్నం చేసి వెంట‌నే దొరికిపోవ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

అసలేం జరిగింది?
వైఎస్సార్ జిల్లాకు (YSR District) చెందిన ఎల్లయ్య (Ellayya) అనే వ్యక్తికి మంజూరైన 14 లక్షల రూపాయల సీఎంఆర్‌ఎఫ్‌ (CMRF) నిధుల్లో 8 లక్షల రూపాయలను టీడీపీ(TDP) నాయకులు త‌న ఖాతాల్లోకి మ‌ళ్లించుకున్నాడు. ఈ వ్యవహారం బయటకు రావడంతో జరిగిన ‘డ్యామేజ్’ను కవర్ చేసుకునేందుకు టీఎన్‌ఎస్‌ఎఫ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్‌ ఒక కొత్త వాదనను తెరపైకి తెచ్చారు. బాధితుడు తమకు ఉన్న పాత అప్పు కింద ఆ 8 లక్షలు ఇచ్చారని చెప్పుకొచ్చారు.

బయటపడ్డ ఫేక్ ప్రామిసరీ నోట్ల బాగోతం
తమ వాదనను నమ్మించేందుకు సదరు నేతలు ఒక లక్ష రూపాయల విలువైన ప్రామిసరీ నోటును మీడియాకు చూపారు. బాధితుడు ఎల్లయ్య బావమరిది శశికుమార్‌కి 8 లక్షలు అప్పు ఇచ్చామని, అందుకే ఆ డబ్బు తీసుకున్నామని బుకాయించే ప్రయత్నం చేశారు. అయితే ఈ ‘అప్పు’ కథపై శశికుమార్‌ స్పష్టత ఇవ్వడంతో టీడీపీ నేతల స్కామ్ నిగ్గు తేలింది.

బాధితుడి బావమరిది శశికుమార్‌ వివరణ
“నేను ఎప్పుడూ టీడీపీ నేతల వద్ద అప్పు తీసుకోలేదు. నేను సాధారణంగా ఇంగ్లీషులో సంతకం చేస్తాను. కానీ, వారు చూపిస్తున్న ప్రామిసరీ నోటుపై తెలుగులో సంతకం ఉంది. వాళ్లే ఫోర్జరీ సంతకాలు చేసుకున్నారు. డబ్బులు కొట్టేసి ఇప్పుడు మాపైనే తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు.”

మతిస్థిమితం లేదంటూ బాధితుడిపైనే ఒత్తిడి
తమ అక్రమాలు ఎక్కడ బయటపడతాయోనన్న భయంతో, అసలు బాధితుడైన ఎల్లయ్యపై టీడీపీ నేతలు తీవ్ర ఒత్తిడి తెచ్చినట్లు తెలుస్తోంది. తనకు మతిస్థిమితం లేదని, అప్పు తీసుకున్న మాట వాస్తవమేనని చెప్పాలంటూ ఆయనతో బలవంతంగా మాట్లాడించే ప్రయత్నం చేయడం వారి బరితెగింపునకు నిదర్శనమని స్థానికులు, బంధువులు మండిపడుతున్నారు. ముఖ్యమంత్రి సహాయ నిధి లాంటి నిధులను కూడా వదలకుండా, అక్రమాలకు పాల్పడటమే కాకుండా.. తప్పును కప్పిపుచ్చుకోవడానికి తప్పుడు పత్రాలు సృష్టించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ స్కామ్‌పై పూర్తిస్థాయి విచారణ జరిపి బాధితులకు న్యాయం చేయాలని జనం డిమాండ్ చేస్తున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment