వైఎస్ స్మృతివనం ఏర్పాటు చేయాలి.. – షర్మిల లేఖ‌

వైఎస్ స్మృతివనం ఏర్పాటు చేయాలి.. - షర్మిల లేఖ‌

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి (YS Rajasekhara Reddy) జ్ఞాపకార్థం హైదరాబాద్‌ (Hyderabad)లో స్మృతివనం (Memorial Park) ఏర్పాటు చేయాలని ఏపీసీసీ (APCC) అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (YS Sharmila) తెలంగాణ ప్రభుత్వాన్ని (Telangana Government) కోరారు. ఈ మేరకు ఆమె తెలంగాణ ముఖ్యమంత్రి (Chief Minister) రేవంత్ రెడ్డి (Revanth Reddy)కి విజ్ఞప్తి చేస్తూ లేఖ రాశారు. తెలంగాణ ప్రభుత్వం త్వరలోనే ఈ కోరికను నెరవేరుస్తుందని ఆశిస్తున్నట్లు షర్మిల పేర్కొన్నారు.

హైదరాబాద్‌లో వైఎస్ స్మృతివనం ఏర్పాటు గురించి కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ (Sonia Gandhi)కి కూడా తాను లేఖ రాసినట్లు షర్మిల తెలిపారు. వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా ఇడుపులపాయలోని ఆయన సమాధి వద్ద షర్మిల నివాళులర్పించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment