కూటమి ప్రభుత్వం (Coalition Government)పై ఏపీ కాంగ్రెస్ (AP Congress) అధ్యక్షురాలు షర్మిల (Sharmila) తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సూపర్ సిక్స్ (Super Six) హామీలపై విమర్శలు గుప్పించిన ఆమె, “సూపర్ సిక్స్ కాదు… సూపర్ ప్లాప్” (Super Flop) అని ఎద్దేవా చేశారు. ముఖ్యంగా మహిళల ఉచిత బస్సు (Free Buss) పథకాన్ని లక్ష్యంగా చేసుకున్న షర్మిల, ఆగస్ట్ 15న ప్రారంభించబోతున్న ఈ పథకం జిల్లాల వరకే పరిమితం కావడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో రోజుకు 16 లక్షల మంది మహిళలు ప్రయాణిస్తుంటే… జిల్లాల పరిమితి చేయడం ఎంత వరకు సమంజసం అని ప్రశ్నించారు. చిన్న పథకానికి ఇన్ని షరతులెందుకని ప్రభుత్వాన్ని నిలదీశారు. మేనిఫెస్టోలో (Manifesto) హామీ ఇచ్చేటప్పుడు దీని భారం తెలియదా? అని షర్మిల నిలదీశారు. ఈ విధంగా రెండు కోట్ల మంది మహిళలను మోసం చేసినట్టేనని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాష్ట్రం 11 లక్షల కోట్ల అప్పులో ఉందన్న సంగతి చంద్రబాబుకు తెలియదా? అని నిలదీశారు. తెలిసి కూడా ప్రజలకు హామీలు ఇచ్చిన చంద్రబాబు ఇప్పుడు అమలు చేయలేమని చెబుతున్నారని విమర్శించారు. “ఓడ దాటేదాకా ఓడ మల్లన్న… దాటి బోడి మల్లన్న” అన్న చందంగా చంద్రబాబు వ్యవహరిస్తున్నారని ఆమె ఎద్దేవా చేశారు. నిరుద్యోగ భృతి పేరుతో యువతను మోసం చేశారని, 20 లక్షల ఉద్యోగాల హామీ పూర్తిగా గాలికొదిలేశారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఏపీలోని 25 మంది లోక్‌సభ (Lok Sabha) ఎంపీలు(MPs), 11 మంది రాజ్యసభ (Rajya Sabha) ఎంపీలు రాష్ట్ర విభజన సమస్యలపై నోరు విప్పే ధైర్యం లేక బీజేపీ(BJP) తొత్తులుగా మారారని వైఎస్ షర్మిల తీవ్ర ఆరోపణలు చేశారు. 2014లో ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్ర విభజన చట్టంలో ఇచ్చిన హామీలైన ప్రత్యేక హోదా, పోలవరం జాతీయ ప్రాజెక్ట్, కడప స్టీల్ ప్లాంట్, దుగరాజపట్నం పోర్ట్, రాజధాని నిర్మాణం వంటి అంశాలపై 11 ఏళ్లుగా ఎటువంటి పురోగతి లేదని ఆయన ఆరోపించారు. రాష్ట్ర ఎంపీలు పార్లమెంట్‌లో బీజేపీ బిల్లులకు మద్దతు ఇవ్వడానికి పోటీపడుతూ, ప్రధాని నరేంద్ర మోడీ మెప్పు కోసం రాష్ట్ర హక్కులను పక్కనపెట్టారని, ఇది రాష్ట్ర ప్రజలకు జరిగిన అన్యాయమని విమర్శించారు.