జగన్ పుట్టిన రోజు.. ఎక్స్‌ టాప్‌ట్రెండింగ్‌లో హ్యాష్‌ట్యాగ్

జగన్ పుట్టిన రోజు.. ఎక్స్‌ టాప్‌ట్రెండింగ్‌లో హ్యాష్‌ట్యాగ్

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పుట్టిన‌రోజు సంద‌ర్భంగా సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్స్‌ హోరెత్తాయి. రెండ్రోజులుగా జ‌గ‌న్ అభిమానులు “అడ్వాన్స్ హ్యాపీ బర్త్‌డే జగనన్న” అంటూ సందడి చేయగా, ఈరోజు “హ్యాపీ బర్త్‌డే వైఎస్ జగన్” హ్యాష్‌ట్యాగ్‌లతో నెట్టింట త‌మ జోరు కొన‌సాగిస్తున్నారు.

అభిమానుల ఆరాధన..
తెలుగు రాష్ట్రాల నుంచి మాత్రమే కాకుండా దేశం నలుమూలలా, విదేశాల్లో కూడా అభిమానులు #HBDYSJagan హ్యాష్‌ట్యాగ్‌ను విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. దీన్ని ఎక్స్ (ట్విట్టర్)లో టాప్ ట్రెండింగ్‌లో నిలిపారు. కేవలం 10 గంటలకు పైగా హ్యాష్‌ట్యాగ్ టాప్-3 స్థానంలో ఉండడం విశేషం.

ఇకపోతే, రాత్రి నుంచే హైదరాబాద్ వంటి ప్రధాన నగరాల్లోనూ అభిమానులు సంబరాలు నిర్వహిస్తున్నారు. కూకట్‌పల్లి, పంజాగుట్ట ప్రాంతాల్లో జరిగిన వేడుకల వీడియోలు వైరల్ అయ్యాయి. సోషల్ మీడియా మాత్రమే కాదు, వాట్సాప్ స్టేటస్‌లు, ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లు, ఫేస్‌బుక్ అప్‌డేట్స్‌లతోనూ జగన్ అభిమానుల త‌మ అభిమానాన్ని చాటుకుంటున్నారు. జగన్ పుట్టిన రోజు సందర్భంగా అభిమానులు ప్రతి ఏటా సరికొత్త రికార్డులను సృష్టిస్తారు. ఈ ఏడాది కూడా అదే కోవలో కొనసాగుతూ, సామాజిక మాధ్యమాల్లో అభిమానులు చూపించిన‌ ప్రేమ మరోసారి అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

Join WhatsApp

Join Now

Leave a Comment