కరేడు రైతుల పోరాటానికి వైఎస్ జగన్ మద్దతు

ఆంధ్రప్రదేశ్‌ (Andhra Pradesh)లో కూట‌మి ప్ర‌భుత్వ‌ (Coalition Government) భూసేకరణకు వ్యతిరేకంగా సాగుతున్న రైతుల (Farmers) పోరాటానికి వైసీపీ (YSRCP) అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) తన మద్దతును (Support)  ప్రకటించారు. నెల్లూరు జిల్లా (Nellore District) కరేడు (Karedu) గ్రామానికి చెందిన రైతులు మంగ‌ళ‌వారం తాడేప‌ల్లిలో మాజీ సీఎం వైఎస్ జ‌గ‌న్‌ను క‌లిశారు. ఈ సంద‌ర్భంగా త‌మ గ్రామంలో జ‌రుగుతున్న భూసేక‌ర‌ణ‌కు సంబంధించిన విష‌యాల‌ను జ‌గ‌న్‌కు వివ‌రించారు.

ఇండోసోల్ సోలార్ (Indosol Solar)  పరిశ్రమ (Industry) ఏర్పాటుతో తమ మూడు పంటలు పండే పచ్చని భూములను బలవంతంగా కూట‌మి ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని చూస్తోందని జ‌గ‌న్ ఎదుట రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. “ఈ భూములే మా జీవనాధారం. ఇవి లేకుండా మేము బతకలేం” అని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ, రైతుల ఆందోళనకు తాను పూర్తి మద్దతుగా ఉంటానని, అవసరమైతే స్వయంగా కరేడు గ్రామానికి వచ్చి రైతులతో మాట్లాడతానని హామీ ఇచ్చారు.

Join WhatsApp

Join Now

Leave a Comment