---Advertisement---

వైఎస్ కుటుంబంలో విషాదం.. అభిషేక్ రెడ్డి మృతి

వైఎస్ కుటుంబంలో విషాదం.. అభిషేక్ రెడ్డి మృతి
---Advertisement---

వైసీపీ అధినేత‌, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. వైఎస్ జగన్ బంధువు, వైసీపీ నేత వైఎస్ అభిషేక్ రెడ్డి గచ్చిబౌలిలోని ఓ ప్రైవేట్ ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. అనారోగ్యంతో గ‌త కొంత కాలంలో హైద‌రాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్న వైఎస్ అభిషేక్‌రెడ్డి.. శుక్ర‌వారం మ‌ధ్యాహ్నం మృతిచెందిన‌ట్లు వైద్యులు ధ్రువీక‌రించారు.

ఈ వార్త వైఎస్ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. అభిషేక్ రెడ్డి మృతితో వారి కుటుంబంలో విషాద‌ఛాయ‌లు అలుముకున్నాయి. అభిషేక్‌రెడ్డి భౌతిక‌కాయాన్ని పులివెందులకు తరలిస్తున్నారు. రేపు ఉదయం జ‌రిగే అభిషేక్‌రెడ్డికి అంత్యక్రియల్లో వైసీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్ పాల్గొననున్నారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment