ప‌వ‌న్ కుమారుడికి గాయాలు.. స్పందించిన జ‌గ‌న్‌

ప‌వ‌న్ కుమారుడికి గాయాలు.. స్పందించిన జ‌గ‌న్‌

ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ (Pawan Kalyan) కుమారుడికి గాయాల‌పై మాజీ సీఎం, వైసీపీ (YSRCP) అధినేత వైఎస్ జ‌గ‌న్ (Y. S. Jagan) స్పందించారు. సింగ‌పూర్‌ (Singapore) లోని స్కూల్‌లో చ‌దువుతున్న ప‌వ‌న్ కుమారుడు (Pawan Son) మంగ‌ళ‌వారం ఉద‌యం స్కూల్‌ (School) లో అగ్నిప్ర‌మాదం (Fire Accident) సంభ‌వించ‌డంతో ఆ పాఠ‌శాల‌లో చ‌దువుతున్న విద్యార్థుల‌కు గాయాల‌య్యాయి. వారిలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ కుమారుడు కూడా ఉన్నారు. మార్క్ శంక‌ర్ కాళ్లు, చేతుల‌కు గాయాలు కావ‌డంతో ఆస్ప‌త్రికి త‌ర‌లించి చికిత్స అందిస్తున్నారు. ఊపిరితిత్తుల్లోనూ పొగ చేర‌డంతో ఇబ్బందులు ప‌డుతున్నార‌ని జ‌నసేన పార్టీ (JanaSena Party) అధికారికంగానే ప్ర‌క‌టించింది.

ప‌వ‌న్ క‌ళ్యాణ్ కుమారుడికి గాయాలు కావ‌డంపై మాజీ సీఎం జ‌గ‌న్ స్పందించారు. సింగపూర్‌లోని ఒక పాఠశాలలో జరిగిన అగ్ని ప్రమాదంలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ గాయపడ్డారని తెలిసి తాను షాక్ గుర‌య్యాన‌న్నారు. గాయ‌ప‌డిన మార్క్ శంక‌ర్ (Mark Shankar) త్వ‌ర‌గా పూర్తిగా కోలుకోవాలని (Recover) కోరుకుంటున్నట్లుగా జ‌గ‌న్ త‌న ట్వీట్‌ (Tweet) లో పేర్కొన్నారు.

ప‌వ‌న్ కుమారుడికి గాయాల‌పై సీఎం చంద్ర‌బాబు, మంత్రి లోకేశ్ సైతం స్పందించారు. అయిన‌ప్ప‌టికీ మాజీ సీఎం వైఎస్ జ‌గ‌న్ ట్వీట్ చేయ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. రాజ‌కీయంగా ఎన్ని విరోధాలు ఉన్న‌ప్ప‌టికీ జ‌గ‌న్ మాన‌వ‌త్వం (Jagan Humanity) తో స్పందించాడ‌ని నెటిజ‌న్లు అభిప్రాయ‌ప‌డుతున్నారు. జ‌గ‌న్ చేసిన ట్వీట్‌ను జ‌న‌సైనికులు సైతం రీట్వీట్ (Re-Tweet) చేస్తుండ‌టం గ‌మ‌నార్హం.

Join WhatsApp

Join Now

Leave a Comment