లండన్ పర్యటనకు జగన్.. కోర్టులో పిటిషన్ దాఖలు

లండన్ పర్యటనకు జగన్.. కోర్టులో పిటిషన్ దాఖలు

వైసీపీ అధినేత‌, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి లండన్ పర్యటనకు అనుమతి కోసం సీబీఐ ప్రత్యేక కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆయన జనవరి 11 నుంచి 25 వరకు కుటుంబంతో కలిసి లండన్ వెళ్లేందుకు అనుమతించాలని కోరారు. ఈ పిటిషన్‌పై సీబీఐ కౌంటర్ దాఖలు చేయాలని కోర్టు ఆదేశించింది. సీబీఐ తమ అభిప్రాయం తెలిపిన తర్వాత ఈ అంశంపై విచారణ జరపనుంది. ఈ టూరుకు అనుమతి ఇచ్చే విషయమై న్యాయస్థానం నిర్ణయం తీసుకోనుంది. జగన్ కుటుంబ సమేతంగా పర్యటనకు అనుమతి కోరడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

Join WhatsApp

Join Now

Leave a Comment