కుమార్తె స్నాత‌కోత్స‌వం.. వైఎస్ జగన్‌ భావోద్వేగ ట్వీట్

కుమార్తె స్నాత‌కోత్స‌వం.. వైఎస్ జగన్‌ భావోద్వేగ ట్వీట్

ప్రపంచ ప్రఖ్యాత కింగ్స్ కాలేజ్ లండన్‌ నుంచి మాస్టర్ ఆఫ్ సైన్స్ (ఫైనాన్స్)లో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కుమార్తె వర్షారెడ్డి పట్టా అందుకున్నారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని, వైసీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్‌ తన భావోద్వేగాలను వ్యక్తం చేశారు. ఈ మేర‌కు తన ఫ్యామిలీ ఫొటోను షేర్ చేస్తూ జ‌గ‌న్ ట్వీట్ చేశారు. లండన్‌లో డిగ్రీ పూర్తిచేసిన తన కూతురు వర్షారెడ్డికి అభినందనలు తెలిపారు. ‘కంగ్రాట్స్ డియర్. ప్రతిష్టాత్మక కింగ్స్ కాలేజీ నుంచి మంచి మార్కులతో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి మమ్మల్ని గర్వపడేలా చేశావు. నీకు దేవుడి ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి’ అని రాసుకొచ్చారు. తన భార్య భారతి, కూతుళ్లు హర్షారెడ్డి, వర్షారెడ్డితో దిగిన ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరలవుతోంది.

Join WhatsApp

Join Now

Leave a Comment