రోజాపై టీడీపీ ఎమ్మెల్యే వ్యాఖ్య‌లు.. వైఎస్ జగన్ ఫైర్

రోజాపై టీడీపీ ఎమ్మెల్యే వ్యాఖ్య‌లు.. వైఎస్ జగన్ ఫైర్

మాజీ మంత్రి ఆర్‌కె రోజా సెల్వమణి (RK Roja Selvamani)పై టీడీపీ ఎమ్మెల్యే (TDP MLA) గాలి భానుప్రకాష్ (Gali Bhanuprakash) చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలపై మాజీ సీఎం (Former CM), వైసీపీ (YSRCP) అధినేత‌ వైఎస్ జగన్ (YS Jagan Mohan Reddy) తీవ్రంగా స్పందించారు. ఇవి అత్యంత హేయమైన వ్యాఖ్యలని ఖండించిన ఆయన, రోజా పట్ల సంఘీభావం ప్రకటిస్తూ ట్వీట్ చేశారు. కూట‌మి ప్ర‌భుత్వ (Coalition Government) నాయ‌కుల‌పై (Leaders) ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party)లో దుష్ట సంస్కృతి ఎలా విస్తరించిందో ఈ ఘటనద్వారా స్పష్టమవుతోందని జగన్ అభిప్రాయపడ్డారు.

రోజా ప్రభుత్వ తప్పిదాలను ప్రశ్నించినందుకే టీడీపీ నేతలు వ్యక్తిగత దాడులకు దిగుతున్నారని ఆయన అన్నారు. ఇది యాదృచ్ఛిక ఘటన కాదని, ధైర్యంగా మాట్లాడే మహిళల గొంతు నొక్కడమే టీడీపీ నేతల లక్ష్యమని ఆరోపించారు. మహిళలపై అసభ్యకర వ్యాఖ్యలు చేసి దుష్ప్రచారం చేయడం చంద్రబాబు రాజకీయ బ్రాండ్‌గా మారిపోయిందన్నారు జగన్. గతంలో విడదల రజని, ఉప్పాల హారికలపైనా ఇదే తరహా దాడులు జరిగాయని గుర్తు చేశారు.

తనపై అసభ్య వ్యాఖ్యలపై ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన రోజాపైనే పోలీసులు అనుమానాలు వ్యక్తం చేయడాన్ని జగన్ తీవ్రంగా తప్పుపట్టారు. ఇది రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ ఎలా దిగజారిందనేదానికి నిదర్శనమన్నారు. మహిళల రక్షణకే అడుగులేని ప్రభుత్వం ఇది అంటూ జగన్ మండిపడ్డారు. తక్షణమే ఎమ్మెల్యే భానుప్రకాశ్‌ను అరెస్టు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Join WhatsApp

Join Now

Leave a Comment