కోనేరు హంపి విజయం.. వైఎస్ జ‌గ‌న్ అభినంద‌న‌లు

కోనేరు హంపి విజయం.. వైఎస్ జ‌గ‌న్ అభినంద‌న‌లు

తెలుగు తేజం కోనేరు హంపి మహిళల వరల్డ్ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్‌గా నిలిచారు. ఈ అపూర్వ విజయంతో భారతదేశానికి గర్వకారణంగా నిలిచిన ఆమెకు దేశవ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

వైసీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి కూడా కోనేరు హంపి విజయంపై స్పందిస్తూ ఆమెకు హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ప్రతిష్టాత్మకమైన 2024 ఫిడే మహిళల ప్రపంచ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్‌షిప్‌లో కోనేరు హంపి అద్భుత విజయం సాధించటం అందరికీ గర్వకారణం. ఈ అపూర్వ విజయం ఆమె స్వస్థలంతోపాటు రాష్ట్ర, దేశమంతటికీ గర్వకారణంగా నిలిచింది. విజయం యువతకు, ముఖ్యంగా బాలికలకు స్ఫూర్తిదాయకం. ఆమె నిరంతర కృషి, అంకితభావం అందరికీ ఆదర్శంగా నిలుస్తుంది. భవిష్యత్తులో హంపి మరెన్నో విజయాలు సాధించాలని కోరుకుంటున్నా అని వైఎస్ జ‌గ‌న్ ట్వీట్ చేశారు.

Join WhatsApp

Join Now

Leave a Comment