ప్రపంచ యాత్రికుడిగా పేరొందిన అన్వేష్ (Anvesh) ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌లో తన నా అన్వేషణ-5 (Na Anveshana-5) అకౌంట్ బ్యాన్ అయిన విషయం తెలిసిందే. కొన్ని వీడియోలు నెటిజన్ల ఫిర్యాదులకు కారణమయ్యడంతో మెటా (Meta) అతని అకౌంట్‌ను నిలిపివేసింది.
తాజాగా అన్వేష్ మరో ఇన్‌స్టా అకౌంట్ ద్వారా తన రియాక్షన్ వీడియోను పోస్ట్ చేశారు. వీడియోలో ఆయన మాట్లాడుతూ.. “ఇన్‌స్టా ఛానల్ పోయినందుకు బాధ లేదు. రూపాయి రాని ఇన్స్టాగ్రామ్ (Instagram) ఉంటే ఏంటి, పోతే ఏంటి. నా వీడియోలు చేయడం ఆపను. బ్యాన్ చేసినా, నా బుర్ర ద్వారా అన్ని నడిపిస్తాను. 2026లో బత్తాయిలకు నరకం చూపిస్తా. యూట్యూబ్ నుండి గత నెల రూ.8 లక్షల ఆదాయం వచ్చింది” అని తెలిపాడు.
ఈ వీడియోకు పాజిటివ్ కామెంట్స్ బాగా వస్తున్నాయి. నెటిజన్లు అన్వేష్ ను మద్దతిస్తూ, “మా సపోర్ట్ నీకే” అని స్పందిస్తున్నారు.








