హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌లో యూత్ కాంగ్రెస్ నేతల సమావేశం రసాభాసగా మారింది. బీఆర్‌ఎస్ నుంచి కొత్తగా వచ్చిన నాయకులకు పార్టీ పదవులు కేటాయించడంపై రెండు వర్గాల మధ్య తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. కొందరు నేతలు అర్హత లేకుండా నియామకాలు జరిగాయని ఆరోపిస్తూ నిలదీయడంతో పరిస్థితి వేడెక్కింది.
యూత్ కాంగ్రెస్ నేతల ఆరోపణలు
యూత్ కాంగ్రెస్ సభ్యుల ఆరోపణల ప్రకారం, కొత్తగూడెం నుంచి చేరిన కొంతమంది నాయకులకు అన్యాయంగా పదవులు కట్టబెట్టారని, నిస్సహాయులుగా ఉన్న సీనియర్ నేతలను పక్కన పెట్టారని వాదిస్తున్నారు. ఇది అక్రమ నియామకమని ప్రశ్నించగా, దాడికి దిగారని బాధితులు చెబుతున్నారు.
అంతర్గత వివాదాలు..
ఈ సంఘటన పార్టీ అంతర్గత విభేదాలను మరింత తెరపైకి తెచ్చింది. నాయకత్వం జోక్యం చేసుకోకపోతే, త్వరలోనే మరోసారి ఇలాంటి ఘర్షణలు పునరావృతమయ్యే అవకాశముందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.