ఎవరీ యోగలక్ష్మి?.. ఈమె ప్రపోజల్ సీన్‌కి యూత్ ఫిదా!

ఎవరీ యోగలక్ష్మి? 'టూరిస్ట్ ఫ్యామిలీ'లో ఆమె ప్రపోజల్ సీన్‌కి యూత్ ఫిదా!

ఇటీవల ఓటీటీలో బాగా ట్రెండ్ అయిన తమిళ సినిమా ‘టూరిస్ట్ ఫ్యామిలీ’. తెలుగు డబ్బింగ్ వెర్షన్ విడుదల కావడంతో మన ప్రేక్షకులకూ ఈ చిత్రం బాగా నచ్చేసింది. ఈ సినిమాలో ప్రధాన పాత్రధారి ధర్మదాస్ అద్దెకు ఉండే ఇంటి యజమాని కూతురిగా నటించిన అమ్మాయి యువతను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఆమె పాత్ర చిన్నదే అయినా, యువతలో ఈమె గురించి సెర్చ్ చేయడం మొదలుపెట్టారు. ఇంతకీ ఈ అమ్మాయి ఎవరంటే..

యోగలక్ష్మి – ‘టూరిస్ట్ ఫ్యామిలీ’ సెన్సేషన్
‘టూరిస్ట్ ఫ్యామిలీ’ సినిమాలో ధర్మదాస్ ఇంటి యజమాని కూతురిగా నటించిన అమ్మాయి అసలు పేరు యోగలక్ష్మి. డస్కీ లుక్‌లో ఉన్నప్పటికీ, ఆమె నటనకు యూత్ ఫిదా అవుతున్నారు. ముఖ్యంగా సినిమాలో ఆమె ప్రపోజల్ సీన్‌ను చాలా మంది రిపీట్స్ లో చూస్తున్నారట.

ఈ సినిమాకు ముందు యోగలక్ష్మి ‘హార్ట్ బీట్’, ‘సింగపెన్నె’ వంటి వెబ్ సిరీస్‌లలో నటించింది. అయితే, వాటి వల్ల ఆమెకు ఓ మాదిరి గుర్తింపు మాత్రమే వచ్చింది. ఈ మధ్య కాలంలో యూట్యూబ్‌లో విడుదలైన ‘మ్యాచ్ ఫిక్సింగ్’ అనే షార్ట్ ఫిల్మ్‌లో కూడా యోగలక్ష్మి నటించింది.

Join WhatsApp

Join Now

Leave a Comment