‘బలగం'(Balagam)తో బ్లాక్బస్టర్ హిట్ అందుకున్న డైరెక్టర్ వేణు(Director Venu) తన కొత్త సినిమా ‘ఎల్లమ్మ'(Yellamma) కోసం మరోసారి ప్రేక్షకుల ముందుకు రానున్నారు. నితిన్(Nithin) ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.
సినీ వర్గాల సమాచారం ప్రకారం, ఈ సినిమా షూటింగ్ మే నెలలో ప్రారంభం కానుంది. ప్రీ-ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా, మ్యూజిక్ డైరెక్టర్లు అజయ్-అతుల్(Ajay-Atul) సంగీతం అందించనున్న ఈ చిత్రానికి సంబంధించి వేణు ఇటీవల మ్యూజిక్ సిట్టింగ్స్ కోసం ముంబై వెళ్లారు. ఈ సినిమా గురించి మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.
ఈ సినిమాలో ఎల్లమ్మగా సాయిపల్లవి నటించనున్నట్లుగా గత కొంతకాలంగా ప్రచారం సాగుతుండగా, దీనిపై చిత్ర యూనిట్ ఇప్పటి వరకు అఫీషియల్ సిగ్నల్ ఇవ్వలేదు.