---Advertisement---

ప్రజలపై రూ.15 వేల కోట్లు భారం.. రేపు వైసీపీ నిర‌స‌న‌

ప్రజలపై రూ.15 వేల కోట్లు భారం.. రేపు వైసీపీ నిర‌స‌న‌
---Advertisement---

కూటమి ప్రభుత్వం ప్రజలపై రూ.15 వేల కోట్ల విద్యుత్ చార్జీల భారాన్ని మోపడాన్ని నిర‌సిస్తూ వైసీపీ అధినేత వైఎస్ జగన్ పిలుపు మేరకు ఈ నెల 27వ తేదీన తలపెట్టిన ర్యాలీలు, వినతిపత్రాల సమర్పణ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పార్టీ రాష్ట్ర సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి కోరారు. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయం నుంచి జిల్లా పార్టీ అధ్యక్షులతో స‌జ్జ‌ల టెలీ కాన్ఫరెన్స్ నిర్వ‌హించారు. అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే కూటమి ప్రభుత్వం ప్రజలపై వేల కోట్ల రూపాయల విద్యుత్ చార్జీల భారం మోప‌డం దుర్మార్గమన్నారు.

ఎన్నికలకు ముందు విద్యుత్ చార్జీలు పెంచమ‌ని చెప్పిన చంద్ర‌బాబు.. అధికారంలోకి రాగానే ఏకంగా రూ.15 వేల కోట్ల విద్యుత్ చార్జీల భారం విధించడం దారుణమ‌న్నారు. దీనిని వ్యతిరేకిస్తూ వైసీపీ ఆధ్వర్యంలో తలపెట్టిన నిరసన కార్యక్రమానికి ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తోందన్నారు. ఈనెల 27వ తేదీన అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ప్రజా భాగస్వామ్యంతో విద్యుత్ కార్యాలయాలకు ర్యాలీలు నిర్వహించాల‌ని జిల్లా అధ్య‌క్షుల‌కు స‌జ్జ‌ల సూచించారు. పెంచిన విద్యుత్ చార్జీలను ఉపసంహరించుకోవాలని కోరుతూ మెమోరాండంలను సమర్పించాల‌న్నారు.

విద్యుత్ చార్జీల పెంపుదల అన్ని వర్గాలపై ఆర్థికంగా భారంను మోపుతోందని ఆయా వర్గాలు కూడా దీనిని వ్యతిరేకిస్తున్నాయ‌ని చెప్పారు. వారంతా వైసీపీ తలపెట్టిన నిరసనల్లో పాల్గొనేందుకు సిద్దంగా ఉన్నారని స‌జ్జ‌ల వివ‌రించారు. ఇటువంటి ప్రజాసంఘాలు, సంస్థలను కూడా కలుపుకుని నిరసన ర్యాలీలు పెద్ద ఎత్తున నిర్వహించాల‌ని, ప్రభుత్వ నిర్ణయం పట్ల ప్రజల్లో ఎంత వ్యతిరేకత ఉందో ఈ కార్యక్రమం ద్వారా పాలకులకు అర్థం కావాల‌న్నారు. సమస్య తీవ్రతను అర్థం చేసుకుని, పెంచిన విద్యుత్ చార్జీలను ఉపసంహరించుకునేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాల‌న్నారు. పార్టీ శ్రేణులు, గ్రామ, మండల స్థాయి నాయకులు, ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమంలో విధిగా పాల్గొనాల‌ని సూచించారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment