INDIA, NDA కూటములకు వైసీపీ మద్దతుపై ఆ పార్టీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి స్పష్టమైన క్లారిటీ ప్రకటన చేశారు. “మేము ఇద్దరి కూటములకు సమాన దూరంలో ఉంటాం” అని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాలను ముందు ఉంచుకుని, వైసీపీ ప్రాథమికంగా ఏ రాజకీయ కూటమిలో కూడా చేరబోదని ఆయన ప్రకటించారు.
న్యూట్రల్ స్టాండ్, ప్రజా ప్రయోజనాలపై దృష్టి
“మాకు ఏ కూటమిలో చేరే ఆలోచన లేదు, మేము న్యూట్రల్ స్టాండ్లో ఉంటాం.” అలాగే, “వన్ నేషన్ వన్ ఎలక్షన్” పై పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఆలోచనలకు అనుగుణంగా JPC ఎదుట తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేయాలని యోచిస్తున్నట్లు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం పోరాటం చేయాలని వైసీపీ నిర్ణయించుకుంది. సామాన్యులపై విద్యుత్ భారం తగ్గించే వరకు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తామని అని విజయసాయిరెడ్డి అన్నారు. అందులో భాగంగానే ఈనెల 27న విద్యుత్ చార్జీల పెంపుపై రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కొనసాగుతుందని చెప్పారు.