అవ‌న్నీ తెచ్చింది వైఎస్ జ‌గ‌నే.. – వైసీపీ ట్వీట్‌

అవ‌న్నీ తెచ్చింది వైఎస్ జ‌గ‌నే.. - వైసీపీ ట్వీట్‌

నేడు ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ శంకుస్థాప‌న చేసే ప్రాజెక్టుల‌న్నీ త‌మ హ‌యాంలో సాధించిన‌వేన‌ని, ఆ ప్రాజెక్టుల‌న్నీ కూట‌మి ప్ర‌భుత్వం త‌న ఖాతాలో వేసుకుంటోంద‌ని ప్ర‌తిప‌క్ష వైసీపీ త‌న ఎక్స్ (ట్విట్ట‌ర్‌) వేదిక‌గా ట్వీట్ చేసింది. ప్రాజెక్టుల సాధ‌న కోసం వైఎస్ జ‌గ‌న్ ప్ర‌భుత్వం క‌ష్ట‌ప‌డితే.. వాటి క్రెడిట్‌ను త‌న ఖాతాలో వేసుకునేందుకు చంద్ర‌బాబు సిగ్గులేకుండా వెంప‌ర్లాడుతున్నాడ‌ని ఆరోపించింది.

ఇవాళ సాయంత్రం విశాఖలో ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభమయ్యే ప్రాజెక్టులు వైసీపీ ప్రభుత్వంలో వచ్చినవేన‌ని స్ప‌ష్టం చేసింది. రైల్వేజోన్‌, బ‌ల్క్ డ్ర‌గ్ పార్క్‌, ఎన్టీపీసీ రాష్ట్రానికి రావ‌డం వైఎస్ జ‌గ‌న్ ఘ‌న‌తేన‌ని వైసీపీ స్ప‌ష్టం చేసింది. తాము చెప్పేవాటికి జీవోల‌తో స‌హా ఆధారాలున్నాయ‌ని వైసీపీ చెబుతోంది. కానీ.. నిజాలు దాచి తామే తెచ్చినట్లు కూట‌మి ప్ర‌భుత్వం గ‌ప్పాలు కొట్టుకోవ‌డాన్ని వైసీపీ ఆక్షేపిస్తోంది.

ఇవాళ సాయంత్రం 4.15 గంటలకు ప్రధానమంత్రి న‌రేంద్ర‌మోదీ ప్రత్యేక విమానంలో విశాఖకు చేరుకుంటారు. 5.30 గంటల వరకు రోడ్‌ షోలో పాల్గొంటారు. 5.30 గంటల నుంచి 6.45 గంటల వరకు ఏయూ ఇంజనీరింగ్‌ కళాశాల మైదానం సభా వేదిక వద్ద నుంచి వర్చువల్‌గా పలు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయ‌నున్నారు. అనంత‌రం ప్ర‌జ‌లను ఉద్దేశించి ప్రసంగిస్తారు. అనంతరం విశాఖ విమానాశ్రయానికి చేరుకుని భువనేశ్వర్ వెళ్ల‌నున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment